Advertisement
Samajavaragamana Review and Rating: శ్రీవిష్ణు,రెబా మౌనికా జాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ సామజవరగమన సినిమాలో సహాయ పాత్రలు పోషించారు. రామ్ అబ్బరాజు ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ ని అందించారు. శ్రీవిష్ణు మంచి హిట్ కోసం చూస్తున్నారు. శ్రీ విష్ణు సినిమాలు అన్నీ కూడా కాస్త వెరైటీగా ఉంటాయి. వెరైటీగా ఉండే కథలని శ్రీ విష్ణు ఎంపిక చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సినిమా తో హిట్ వచ్చేసిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. జూన్ 29, 2023న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది.
Advertisement
కథ, రివ్యూ :
బాలు (శ్రీవిష్ణు) ప్రేమ కి దూరం. ప్రేమంటే నచ్చదు. ఎవరైనా ప్రొపోజ్ చేసారంటే రాఖీ కట్టించుకుంటుంటాడు. బాలు తండ్రి (సీనియర్ నరేష్) డిగ్రీ ప్యాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేలా తాతయ్య వీలునామా రాసేసి చనిపోతాడు. తండ్రి డిగ్రీ పాస్ అవ్వాలని ఎంతో కష్టపడుతుంటారు. బాలు వాళ్ళ నాన్న ముప్పై ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూ ఉంటాడు. డిగ్రీ పరీక్షలు రాయటానికి సరయు (రెబా మౌనికా జాన్) అక్కడ బాలుకి పరిచయం అవుతుంది.
Advertisement
హాస్టల్ లో ఉండడం ఇష్టం లేక బాలు ఇంటికే పేయింగ్ గెస్ట్‌గా ఆమె వస్తుంది. కొన్ని రోజులకి ప్రేమలో పడతారు. బాలు అత్తయ్య కొడుక్కి రాజమండ్రి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. సరయు వాళ్ళది కూడా రాజమండ్రి. ఆమెకి రాజమండ్రి వెళ్లి సర్పరైజ్ చేద్దాం అనుకుంటాడు. తీరా చూస్తే బాలు బావ పెళ్లి చేసుకోవయేది సరయు వాళ్ళ అక్కయ్యనే. ఇక్కడే ఓ పెద్ద చిక్కు.
బాలు, సరయు పెళ్లికి సమస్య ఏమిటి..? ఆఖరికి వాళ్ళు ఎలా ఒకటయ్యారు అనేదే కథ. హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్‌లో డైరెక్టర్ స్టోరీ ని బాగా ఇచ్చారు. నటులు అంతా కూడా బాగా వారి పాత్రలు పోషించారు. హీరో తండ్రిగా నరేష్ బాగా నటించారు. క్లైమాక్స్‌లో ఓ చిన్న ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. గోపీససుందర్ పాటలు, నేపథ్య సంగీతం కూడా బాగున్నాయి.
Rating: 3.25/5
Also read:
Spy movie review: నిఖిల్ ”స్పై” సినిమా హిట్టా..? ఫట్టా..?