Advertisement
గత కొంతకాలం నుంచి భారత జట్టులో సంజు శాంసన్ కు సరైన అవకాశాలు రాకపోవడం పై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలెక్టరులు కావాలని సంజు శాంసన్ విషయంలో వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. సరిగ్గా ఆడని రిషబ్ పంత్ కు వరుసగా అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు మంచిగా ఆడినా కూడా ఎందుకు సంజు శాంసన్ ను పక్కన పెడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి : కొడాలి నానితో ఢీ : ఎవరీ వెనిగండ్ల రాము? ఆయన బలమెంతా?
సంజు, దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి టీం ఇండియాలో చోటు దక్కడం లేదని కొందరు ఆరోపిస్తే, మరికొందరు కులం, మతం వంటి వాటిని తీసుకొస్తూ బీసీసీఐని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు చేస్తున్న వారిపై ఫైర్ అయ్యాడు సంజు శాంసన్ చిన్ననాటి కోచ్ బిజు జార్జ్. ‘సంజు శాంసన్ కి అవకాశాలు రావడం లేదు అది కరెక్టే. కానీ ఈ మల్లు జనాలు, సంజు శాంసన్ కి, బీసీసీఐకి మధ్య పుల్లలు పెడుతున్నారు. రిషబ్ పంత్ నీ తిడుతూ శాంశానికి ఛాన్స్ ఇవ్వకపోవడానికి పిచ్చిపిచ్చి కారణాలు వెతుకుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. కేరళలో రాజకీయల నాయకులు కూడా క్రికెట్ ని రాజకీయం చేసేసారు. సంజు శాంసన్ పై వివక్ష చూపిస్తున్నారని, అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు బిజు జార్జ్.
Advertisement
కొన్నిసార్లు ఎంత టాలెంట్ ఉన్నా, రిజర్వు బెంచ్ లో కూర్చోవాల్సి ఉంటుంది. సరైన సమయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. సంజు శాంసన్ విషయంలో జరుగుతుంది అదే. అదికాకుండా ప్రస్తుతం టీమిండియా కి కోచ్ గా ఉన్నది వివిఎస్ లక్ష్మణ్. అతను సౌత్ వాడు కాదా? టీమిండియా మెయిన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సౌత్ వాడే కదా. ఆఖరి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నది కూడా దక్షిణ భారతీయుడే అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి : 2001 కోల్కతా టెస్ట్ ఆస్ట్రేలియా తో గెలుపు లక్ష్మణ్, ద్రావిడ్ కాదు గంగూలీ ఎలాగంటే ?