Advertisement
Satyabhama Review: సత్యభామ సినిమాకు బాబీ తిక్క మరియు శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా…విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందించారు.
సంగీతాన్ని శ్రీ చరణ్ పాకాల అందించారు. కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవివర్మ తదితరులు నటించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.
Advertisement
సినిమా: సత్యభామ
దర్శకత్వం: సుమన్ చిక్కాల
నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి
నటీ నటులు: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవివర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
కథ మరియు వివరణ:
సత్యభామ సినిమా లేడీ ఓరియంటెడ్ స్టోరీ. ఈ సినిమాలో కాజల్ ఒక పోలీస్ ఆఫీసర్ గా పాత్ర లో కనబడతారు. అయితే కాజల్ పాత్ర పేరు సత్యభామ. ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఎంతో స్పెషల్ కేసు అనేది ఒకటి ఉండడం సహజం అదేవిధంగా ఈ కథలో సత్యభామ ఒక కేసును పర్సనల్ గా తీసుకోవడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత కాజల్ మంచి కథను ఎంపిక చేసుకున్నాను అని చెప్పడం జరిగింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం చాలా కష్టం అని చెప్పవచ్చు, దానికి చాలా ధైర్యం కావాలి. అయితే కాజల్ కథ విన్నాక ఎంతో నమ్మకంతో దీనిని పూర్తిచేసారు.
ఈ కథలో కాజల్ తప్పిపోయిన వ్యక్తి కేసును పరిశోధిస్తుంది, దానిలో భాగంగా ఎంతో న్యాయపరంగా తన బాధ్యతను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక కథ విషయానికి వస్తే.. సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీంలో ఏసీబీ స్థాయిలో పనిచేస్తారు. ఆమె సైలెంట్ గా ఉంటూ నేరస్తుల దగ్గర నుండి నిజాలు తెలుసుకోవడానికి ఎంతో ప్లాన్ చేసుకుని వాళ్ళ చేత నిజాలను కక్కిస్తారు. ఆడవాళ్లకు ఏ ఇబ్బందులు కలగకూడదని ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. రచయిత అయిన అమరేందర్ ని పెళ్లి చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితం కంటే కూడా డ్యూటీకి ప్రాధాన్యతను ఇస్తుంది.
Advertisement
Also read:
ఒకరోజు హసీనా అనే ఆవిడ సత్యభామ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. సత్యభామ భయం లేదు నేను ఉన్నాను అని చెబుతారు. హసీనా భర్త తనను హత్య చేస్తాడు ఇక అతను చూసి చలించిపోయిన సత్యభామ అతని కోసం వెతుకుతుంది. హసీనా మరణం వెనుక సత్యభామ వైల్డ్ గా ఎందుకు రెస్పాండ్ అవుతుంది..? హసీనాకు ఆమెకు లింక్ ఏంటి..? ఇవి తెలియాలంటే సినిమా చూడాలి. డైరెక్టర్ తీసుకున్న కథలో కొత్తదనం లేదు. కాజల్ క్యారెక్టర్ ని వైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. పైగా క్యారెక్టర్రైజేషన్ చాలా దాకా పక్కదారి పడుతూ ఉంది. ఆమె పాత్ర ఎలా ఉంటుందని సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారో అలాంటి క్యారెక్టర్ని కాకుండా ఇంకోటి చూపించినట్టు వుంది. దీనితో ప్రేక్షకుడు ట్రావెల్ అవ్వలేడు. సినిమా స్క్రీన్ ప్లే పరంగా ఒకే. కాజల్ అగర్వాల్ తన నటనతో బానే మెప్పించారు. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు.
Also read:
ప్లస్ పాయింట్స్:
కాజల్ అగర్వాల్
ట్విస్టులు
మైనస్ పాయింట్లు:
రొటీన్ కథ
బోరింగ్ సీన్స్
రేటింగ్: 2.25/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!