Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఏపీ దివంగత సీఎం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకైక పుత్రుడు జగన్. భారతీ సిమెంట్, సాక్షి ప్రసార మాద్యమం, సండూరు జలవిద్యుత్ కేంద్రం వ్యవస్థాపకుడు జగన్ అనే విషయం దాదాపు తెలిసిందే. సీఎం జగన్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Advertisement
వై.ఎస్.జగన్ పులివెందులలో 1972లో జన్మించారు. పులివెందులలో ప్రాథమిక విద్యను అభ్యసించి తరువాత హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 12వ తరగతి వరకు చదివారు. ఇక ఆ తరువాత నిజాం కళాశాలలో బీకాం చదివారు. ఇక ఆ తరువాత లండన్ లో ఎంబీఏ చేయడానికి వెళ్లారు. కానీ అక్కడ చదువు మధ్యలోనే ఆపేసి వచ్చేశారు. 1996లో డాక్టర్ గంగిరెడ్డి కుమార్తె భారతిని వివాహం చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. గంగిరెడ్డి, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిలు ఎంబీబీఎస్ లో క్లాస్ మేట్స్. భారతి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు.
పెళ్లి అయిన తరువాత వ్యాపారాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న జగన్ 2009లో కడప ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు జగన్ బెంగళూరులోని లాంకోహిల్స్ లో పని చేసేవారు. జగన్ కి ఇద్దరూ కూతుర్లు. పెద్ద కూతురు వర్షరెడ్డి, చిన్న కూతురు హర్షరెడ్డి. పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో సీటు సంపాదించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
Advertisement
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతి స్వల్ప ఓట్ల శాతంతో పరాజయం పొంది ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగాడు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ తరువాత ఏపీలో సొంత పార్టీ పెట్టి అధికారం దక్కించుకొని రికార్డు నమోదు చేశారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం అవ్వకముందు కడప బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కొనసాగారు జగన్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి ఫ్యాక్షన్ సినిమాల వల్లనే జగన్ బాలయ్య అభిమాని అయ్యారని అప్పట్లో టాక్ వినిపించింది.మరోవైపు ఏపీలో 9 నెలల్లో ఎన్నికలు జరుగనుండటంతో ఏ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందో వేచి చూడాలి మరి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :