Advertisement
మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో అంజలి, సమంత హీరోయిన్స్ గా నటించారు. సినిమా చూస్తున్నంత సేపు మన చుట్టూ జరుగుతున్న సన్నివేశాలను చూస్తున్నట్లు సరదాగా సాగిపోతుంది ఈ సినిమా. ఎక్కడ బోర్ కొట్టకుండా.. అలా అని సీరియస్ గా లేకుండా.. సరదాగా సాగిపోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో వెంకటేష్ డైలాగ్స్.. మహేష్ బాబు డైలాగ్స్ తో పాటు రావు రమేష్ గారి డైలాగ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఈ సినిమాలో టెంప్లేట్స్ తో ఇప్పటికి ఎన్ని వందల మీమ్స్ వచ్చాయో లెక్క లేదు.
Advertisement
ఇవి కూడా చదవండి: ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. అనిరుధ్ ఫ్రీగా పాటలు పాడతాడని.. మీకు తెలుసా..?
అంతగా పాపులర్ అయిన ఈ సినిమాను చూడని ప్రేక్షకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పటికీ ఈ సినిమాను టివిలో వేస్తె కచ్చితంగా చూస్తూ ఉంటారు. ఇన్ని సార్లు చూసిన ఈ సినిమాలో డైలాగ్స్ చెప్పమంటే తడుముకోకుండా చెప్పే మనం.. ఈ సినిమాలో పెద్దోడు, చిన్నోడు పేర్లు చెప్పమంటే మాత్రం ఆలోచనలో పడతాం. ఎందుకు అంటారా? ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కడా వాళ్ళని పేర్లు పెట్టి పిలిచినట్లు కనిపించదు. పెద్దోడా.. చిన్నోడా అనే పిలుస్తూ ఉంటారు. ఇంతకీ వారి పేర్లు ఏమిటో ఈ ఆర్టికల్ లో చూసేయండి.
Advertisement
ఇవి కూడా చదవండి: రెండవ పెళ్లి కి సిద్ధం అయిన నిహారిక మాజీ భర్త.. ఆమె కూడా సెలబ్రెటీనే… ఎవరంటే..?
అసలు కథ రాసుకున్నప్పుడు ఈ సినిమాలో వెంకటేష్ పాత్రకి మల్లికార్జున్ రావు అని, మహేష్ బాబుకు సీతా రామరాజు అని అనుకున్నారట. కానీ.. స్క్రిప్ట్ నేరేట్ చేస్తున్నప్పుడు అందరికి పెద్దోడు, చిన్నోడు అని నేరేట్ చేస్తూ వచ్చాడట. దీనితో అసలు పేర్ల కంటే.. ఇలా పెద్దోడా చిన్నోడా అని పిలవడమే బాగుంది అని భావించిన శ్రీకాంత్ అడ్డాల వాటినే ఫిక్స్ అయిపోయాడట. అందుకే సినిమాలో కూడా పెద్దోడా, చిన్నోడా అనే పిలుస్తూ వచ్చారట.
ఇవి కూడా చదవండి: Skanda: స్కంద సినిమాలో రామ్ కు చెల్లెలిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?