Advertisement
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. పార్టీకి ఓ సీనియర్ లీడర్ అయిన మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించినట్లు తెలిపారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన ఆయన కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిసిసి చీఫ్ పదవి కోసం రూ. 25 కోట్లు ఇచ్చారని ఓ ఎంపీ ఆరోపించారు. పార్టీలో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ మాట నడుస్తుంది.
Advertisement
గత ఎన్నికల్లో ఏ సర్వే ద్వారా తనకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యరనే అపవాదు ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ దిగజారుతుందని మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాల్టి నుంచి కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటం లేదని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి కలవడంతో పాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, బిజెపిలో చేరబోతున్నారనే కారణంతో ఆయనపై కాంగ్రెస్ ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే.
Advertisement
కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన అనంతరం తొలిసారి ఆయన మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు. మొన్న అమిత్ షాను కలిసాను. త్వరలోనే బిజెపిలో చేరుతానని మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, చీటర్. హోంగార్డు ఎప్పుడు ఐపిఎస్ కాలేరని రేవంత్ అనడం సరికాదు. విహెచ్ పోతా అంటే గోడకేసి కొడతా అని రేవంత్ అనడం ఏంటని మండిపడ్డారు. రెడ్లే చాలు అన్న ధోరణిలో రేవంత్ ఉన్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఓట్ల సంఖ్య తగ్గినా ఎవరికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.
Also Read: ఊహతో హీరో శ్రీకాంత్ విడాకులు?