Advertisement
ఎన్టీఆర్, గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు 1983,మే 20న పుట్టాడు ఎన్టీఆర్. బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాల నటుడుగా తెరంగేట్రం చేసిన, 1996లో బాల రామాయణంలో రాముడిగా అద్భుతంగా నటించి అందరూ చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఈ మూవీకి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకొని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చాటి చెప్పాడు. 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. సినిమాలతో పాటు టిడిపి పార్టీ కోసం పనిచేసి, మంచి పేరు సంపాదించారు ఎన్టీఆర్.
Advertisement
అయితే తాజాగా సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలను తెలియజేశారు. అవేంటో చూద్దాం!జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ స్టార్ట్ చేసిన 25 సంవత్సరాలు అవుతున్నది. ఎన్టీఆర్ బాల రామాయణం మూవీ తర్వాత విజయవాడలో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నేను సినిమా ఫీల్డ్ లోనే ఉండాలి అనుకుంటున్నాను. ఫీల్డ్ లో నా సినిమాలు ప్లాప్ అయినా చివరికి ఇండస్ట్రీలో లైట్ బాయ్ గా అయిన పని చేస్తానని చెప్పారు. అయితే ఎన్టీఆర్ ను మొదటిసారిగా విశ్వామిత్ర సినిమా ద్వారా సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ బాల భరతుడు పాత్రలతో సినిమాల్లోకి తీసుకువచ్చారు.
Advertisement
ఈ విధంగా ఎన్టీఆర్ ను సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకున్నారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి పూర్తిగా దూరమయ్యారు. చివరికి బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ కు కూడా వీరిని లోపలికి రానివ్వలేదు అంటే ఏ విధంగా అవాయిడ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆనాటి నుంచి ఎన్టీఆర్ నేను ఒక పెద్ద సక్సెస్ సాధించి ఆ కుటుంబాన్ని నా వైపు తిప్పుకోవాలనేది ఆయన ఒక యుద్ధంగా భావించారు. చాలా చిన్న వయసులోనే మొదలుపెట్టి ఆ సమయంలో పెద్దపెద్ద హీరోలతో పోటీ పడుతూ నెగ్గుకుంటూ వచ్చారు ఎన్టీఆర్. ఈ రోజున బాలకృష్ణ, హరికృష్ణ గారు చనిపోయిన పర్వాలేదు కానీ ఎన్టీఆర్ నేనున్నానని మాట్లాడాడు. ఈ విధంగా ఎన్టీఆర్ తనకు తానే కష్టపడి ఒక యుద్ధాన్ని గెలిచారని చెప్పవచ్చు. ఈ విధంగా ఇండస్ట్రీలో యుద్ధం చేశారు. జీవితంలో యుద్ధం చేశారు. ఎన్టీఆర్ అందుకే మిగిలిన హీరోలందరితో పోలిస్తే ఎన్టీఆర్ వ్యక్తిత్వం కానీ, ఆయన కష్టపడి సాధించిన విజయాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో జీవితం తెలిసిన హీరో ఎన్టీఆర్ అని చెప్పవచ్చు అని షాకింగ్ నిజాలు చెప్పారు.
Read Also : పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు…?