Advertisement
మల్టీస్టారర్ అనగానే ఇద్దరు హీరోలు ఉంటారనే అనుకుంటాం. అదే ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండటం కామనే. కానీ ఇద్దరు హీరోయిన్లు కూడా హీరోలకు తీసిపోకుండా ఫైట్లు, అడ్వెంచర్లు చేస్తే, ఆ ఊహకే ఎంతో బాగుంది కదా. శాకిని డాకిని సినిమా ఇలాంటిదే. నివేదా థామస్, రెజీనా కసాండ్రా కలిసి నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే.. ఈ సినిమా థియేటర్లలో ఇవాళ రిలీజ్ అయింది. ఇక సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
కథ & వివరణ:
దామిని (రెజీనా) మరియు శాలిని (నివేదా థామస్) లు పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో జాయిన్ అవుతారు. మొదట్లో ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు ఉండేవి. ఇద్దరూ అహంకారంతో గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు. ఇద్దరికీ ప్రతి విషయంలో కూడా విభేదాలు ఉండేవి. అలాంటి వారిద్దరూ ఒక అర్ధరాత్రి సమయంలో అమ్మాయి కిడ్నాప్ ని చూస్తారు. వెంటనే పోలీసులకు తెలియజేసిన కూడా అప్పటికే మరో పెద్దవాళ్ళ కేసుతో బిజీగా ఉండటం వల్ల, అమ్మాయికి సంబంధించిన కిడ్నాప్ గురించి పట్టించుకోరు. దాంతో ట్రైనీ పోలీసులు అయినా దామిని మరియు షాలిని ఆ కేసులో అనధికారికంగా ఎంక్వైరీ మొదలు పెడతారు.
Advertisement
ఆ సమయంలో ఆ కిడ్నాప్ వెనుక అత్యంత పెద్ద క్రైమ్ జరుగుతుందని గుర్తిస్తారు. ఆ క్రైమ్ ను ఇద్దరు ఎలా బయటకు తీసుకు వస్తారు? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అనేది కథ. ఇక రెజీనా మరియు నివేదా థామస్ లు ఇద్దరూ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇద్దరికీ ఇద్దరు కూడా పోటాపోటీ అన్నట్లుగా నటించి మెప్పించారు. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు ఇద్దరు కూడా కాస్త ఎక్కువగానే కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నివేదా థామస్ యొక్క బబ్లీ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. రెజీనా తన రెగ్యులర్ లుక్ లో కనిపించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక సినిమాలో మిగిలిన పాత్రల్లో నటించిన సుధాకర్ రెడ్డి, రఘుబాబు, పృధ్విల కామెడీ ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్ –
కామెడీ, రెజీనా, నివేతల యాక్టింగ్, సెకండాఫ్
మైనస్ పాయింట్స్
రొటీన్ కామెడీ,
ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం,
మ్యూజిక్
రేటింగ్ -2/5
Read Also : పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు…?