Advertisement
ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ల క్రితం పెను సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రతి అంశం సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కనిపెట్టిన అంశాల ఆధారంగా దర్యాప్తు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఆటంకాలు తప్పడం లేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విచారణను ఆంధ్ర నుంచి తెలంగాణకు మార్చాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Advertisement
Read also: మోడీ టార్గెట్ గా కేటీఆర్ సంచలన ట్వీట్ !
ఈ విషయమై తీర్పు వెలువరించాల్సి ఉంది. మరోవైపు అప్రూవర్ గా మారిన వివేకానంద రెడ్డి కారు మాజీ డ్రైవర్, నిందితుడు దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వైయస్ జగన్ సొంత సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ వ్యవహారంపై సిబిఐ డైరెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై సిబిఐ డైరెక్టర్ కు వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మరో కీలక అంశంపై ఆమె సిబిఐ డైరెక్టర్ కు ఫిర్యాదుతో కూడిన వాంగ్మూలం ఇచ్చినట్లు టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన కామెంట్స్ చేశారు.
Advertisement
ఈ కేసులో తొందరలోనే సిబిఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.. ఇక ఆయన తప్పించుకోవడం అసాధ్యమని చెప్పారు. దీనికి సంబంధించి తన వద్ద నిర్దిష్ట సమాచారం కూడా ఉందని అన్నారు బీటెక్ రవి. దీంతో వివేకా కేసులో సోదరి సునీతకు తోడు ఇప్పుడు షర్మిల కూడా పోరాటం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ కేసులో జగన్ ప్రమేయం కూడా ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీటెక్ రవి.
Read also: మీరు నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే.. ?