Advertisement
Shine Tom Chacko Engagement: షైన్ టామ్ చాకో.. అంటే తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టలేరేమో.. కానీ, దసరా సినిమా విలన్, నాగ సౌర్య రంగబలి సినిమా విలన్ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయమైన విలక్షణమైన నటుడు షైన్ టామ్ చాకో. ఈయన తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. మలయాళంలో చాలా పాత్రలు పోషించి స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ సందడి చేస్తున్నారు.
Advertisement
దసరా సినిమాతో పవర్ ఫుల్ విలన్ గా పరిచయం అయిన షైన్ టామ్ చాకో నాగ సౌర్య హీరోగా నటించిన రంగబలి సినిమాలో కూడా విలన్ గా కనిపించి మెప్పించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా కీలక పాత్రని పోషిస్తున్నారు. 2011 నుంచే సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తూ వచ్చిన షైన్ టామ్ చాకోకు మలయాళంలో చాలా మంచి ఫేమ్ ఉంది. కరోనా టైం లో చాలా మంది మలయాళం సినిమాలను చూడడంతో ఈయన బాగా సుపరిచితుడే అయ్యాడు.
Advertisement
రీసెంట్ గా వచ్చిన పాన్ ఇండియా మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్ లో కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈయన లవ్ స్టోరీ గురించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తనూజ అనే అమ్మాయితో ప్రేమలో పడిన షైన్ టామ్ చాకో ఇటీవల ఆమెతో ఎంగేజ్మెంట్ వేడుక కూడా జరుపుకున్నాడు. మరో రెండు నెలల్లో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. షైన్ టామ్ చాకో వయసు నలభై సంవత్సరాలు. షైన్ టామ్ చాకోకు ఇది రెండవ వివాహం అని తెలుస్తోంది. తబిత అనే అమ్మాయితో మొదటి వివాహం జరిగిందనీ, వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడని వార్తలు అయితే.. వస్తున్నాయి కానీ.. కచ్చితంగా వాస్తవం ఏమిటి అనేది తెలియరాలేదు.
Read More:
ఓ టీచర్.. ఓ స్టూడెంట్.. ఓ రొమాంటిక్ ఫోటో షూట్.. ఆ తరువాత ఏమైందంటే?
తరుణ్, సందీప్ మొదలైన టాలీవుడ్ హీరో కనపడకుండా పోవడానికి కారణం ఏమిటి..? ఇప్పుడేం చేస్తున్నారు..?