Advertisement
నాగచైతన్య, శోభితల పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. సమంతకి 2021లో చైతన్యవిడాకులు ఇచ్చారు. తర్వాత ఇంకో హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డారు. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీళ్ళు పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్లో నాగార్జున నివాసంలో వీళ్ళ నిశ్చితార్థం జరిగింది. కొందరు కుటుంబ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. డిసెంబర్ 4న పెళ్లి ఫిక్స్ చేశారు నాగచైతన్య శోభితల పెళ్లి కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. శుభలేఖలో నాగార్జున అమల పేర్లతో పాటుగా లక్ష్మీ, విజయ రాఘవన్ పేర్లు కూడా ఉన్నాయి.
Advertisement
అక్కినేని నాగేశ్వరరావు దగ్గుబాటి రామానాయుడు దంపతుల పేర్లు కూడా ఉన్నాయి. బంధువులు, సన్నిహితులు, ప్రముఖులకి పెళ్లి కార్డులు ఇచ్చి ఇన్వైట్ చేస్తున్నారు. వైజాగ్ వేదికగా వీళ్ళ పెళ్లి జరుగుతుందని సమాచారం. పెళ్లికి ముందే చైతన్య శోభితకి కండిషన్స్ పెట్టారు. ఏకంగా ఆమె పేరుని కూడా మార్చేస్తున్నారట. చైతన్య తల్లి ఇందుకు కారణమట. చైతన్య తల్లి కోరిక మేరకు శోభిత పేరుని మారుస్తున్నారు.
Advertisement
Also read:
పెళ్లి తర్వాత లక్ష్మీ శోభితగా నాగచైతన్య భార్య పేరు ఉండబోతోంది. తన పేరుకు ముందు చైతన్య తల్లి పేరును జోడించేందుకు శోభిత అభ్యంతరం చెప్పలేదు. పెళ్లిలో హెవీ మేకప్ ఉండకూడదని చైతన్య తల్లి లక్ష్మీ ఆదేశించారు. అలాగే సాంప్రదాయ చీరకట్టు నార్మల్ మేకప్ తో కనిపించాలని కూడా కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. లక్ష్మీ చెన్నై కి చెందిన వ్యాపారవేత్త విజయ రాఘవన్ ని తర్వాత పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక అబ్బాయి ఉన్నట్లు సమాచారం.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!