Advertisement
ప్రభాస్ పెద్దమ్మ దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామల దేవి గురించి అందరికీ తెలుసు. ఆమె గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇకపోతే శ్యామల దేవి ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా త్వరలోనే చేస్తాం మాకు చేయాలని ఉంది కలిసి రావట్లేదు అని చెప్తూ ఉంటారు. తాజాగా ఈమె ప్రభాస్ పెళ్లి పై స్పందిస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.
Advertisement
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి యువ నటుడు రక్షిత్ అట్లూరితో కలిసి జూబ్లీహిల్స్ లో జరిగిన ఒక స్టోరీ ఓపెనింగ్ కి వెళ్లారు. అక్కడ ఆమె మాట్లాడుతూ కంచి పట్టు చీరలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ స్టోర్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. ప్రభాస్ పెళ్లికి కూడా ఇక్కడి నుండి దుస్తులు కొనుగోలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Also read:
షాప్ ఓపెనింగ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. సినిమాల్లో బానే రాణిస్తున్నా ప్రభాస్ పెళ్లి విషయానికి వచ్చేసరికి ఎప్పటికప్పుడు మాటలు దాటేస్తున్నారు. నాలుగు పదులు వయసు వచ్చిన సరే పెళ్లి గురించి ఓ నిర్ణయానికి రావట్లేదు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై కాస్త నిరాశ చెందుతున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!