Advertisement
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా రక్షిత అనే యువతితో శర్వానంద్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి, సురేఖతో పాటు నాగార్జున ఫ్యామిలీ సైతం హాజరయ్యింది. ఇక ఈ ఎంగేజ్మెంట్ కు పలువురు సిద్ధార్థ కూడా వచ్చాడు.అయితే సిద్ధార్థ్ సింగిల్ గా రాలేదు.
Advertisement
సిద్దార్థ్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ అదితి రావు హైదరి కూడా వచ్చింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి శర్వానంద్ జంటతో కలిసి ఫోటో దిగారు. అయితే గతంలో శర్వానంద్,సిద్ధార్థ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో అదితి హీరోయిన్ గా నటించింది. కాగా, సినిమా సమయంలో సిద్ధార్థ్ తో అదితి రావు ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత కూడా సిద్ధార్థ్, అదితి కలిసి చట్టపట్టలేసుకుని తిరుగుతున్నారు.
Advertisement
గతంలో ఇద్దరు కలిసి ముంబైలో మీడియాకు చెక్కారు. ఆ సమయంలో సిద్ధార్థ్ ఫోటోలు లీవ్ చేయవద్దు అని మీడియాను కూడా హెచ్చరించారు. ఆనాటి నుండే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇద్దరు ఇప్పుడు శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో కనిపించడంతో సిద్ధార్థ్ తన రిలేషన్షిప్ ను బయట పెట్టడానికే హీరోయిన్ తో కలిసి వచ్చాడా, అన్న అనుమానాలు మొదలయ్యాయి.
READ ALSO : ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!