Advertisement
చాలా మంది మాంసాహారని ఎక్కువగా తింటూ ఉంటారు. మాంసాహారం తినడం వలన కలిగే నష్టాలు చూసారంటే ఆశ్చర్యపోతారు. మాంసాహారం తీసుకోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా మాంసాహారంలో ఉంటాయని మాంసాహారం మోతాదుకు మించి తీసుకోవడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినే వాళ్ళకి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. అలానే మోతాదుకు మించి తింటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్లలో ఇబ్బందులు వస్తాయని డాక్టర్లు అంటున్నారు.
Advertisement
శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల శాతం ఎక్కువైతే పురుషుల్లో సంతాన ఉత్పత్తి తగ్గిపోతుందని ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్లలో టెస్టోస్టెరీన్ ప్రభావం చేసే గుణాలు ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే తక్కువ టెస్టోస్టెరీన్ గుండె జబ్బులు, డయాబెటిస్, ఆల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకి దారితీస్తుందని మాంసం ఎక్కువ తీసుకోవడం వలన ఆయుష్ కూడా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Advertisement
Also read:
Also read:
మాంసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఇలా ఎన్ని నష్టాలు ఉంటాయట. కాబట్టి ఎప్పుడు కూడా ఆహారాన్ని లిమిట్ గా తీసుకోండి. ముఖ్యంగా మాంసాహారాన్ని లిమిట్ గా తీసుకోండి. అన్ని రకాల పోషకాలు ఉండేటట్టు సమతుల్యమైన ఆహారం తీసుకోండి .అధికంగా మాంసాహారాన్ని తీసుకోవడం వలన ఈ నష్టాలు అయితే తప్పవు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!