Advertisement
పడుకున్నప్పుడు పదేపదే చనిపోయిన వారు కలలో కనపడుతున్నారా? ఇలా కనపడితే మరణించిన వారు ఆత్మ రూపంలో మన చుట్టూ తిరుగుతున్నారనే భయం మనలో కలగటం సాధారణం. దాదాపు మనకు సన్నిహితంగా ఉన్నవారు, ఇష్టమైన వ్యక్తులు మాత్రమే మరణాంతరం కలలో కనబడతారు. అయినప్పటికీ అలా కనిపించడం మనలో ఆందోళనలు కలిగిస్తుంది. నిజానికి స్వపాన శాస్త్రంలో ఇలాంటి వాటి గురించి చర్చించబడింది. ఈ శాస్త్రంలో కలలో ఇలాంటి సంఘటనల వలన కలిగే శుభ మరియు అశుభ సంకేతాల గురించి పూర్తిగా వివరించబడింది. ఇలాంటి భయానక పరిస్థితుల నుండి భయపడటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
#1 స్వపాన శాస్త్రంలో తెలిపిన దాని ప్రకారం, మన కుటుంబంలో మరణించిన వారు కలలో పదేపదే కనబడుతున్నారంటే దానికి అర్థం వారు మరణించిన, వారి ఆత్మ మనతోనే సంచరిస్తుందని అర్థం. ఆచారబద్ధంగా కొన్నిటిని పాటించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. కలలో కనిపించే పేరు మీద రామాయణం లేదా భగవద్గీత పటించటం ప్రారంభించండి.
Advertisement
#2 ఒకవేళ చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే, ఆ వ్యక్తి మీ నుండి ఏదో ఆశిస్తున్నాడని అర్థం. కావున కలలో చెప్పిన విధంగా ఆ పనిని పూర్తి చేయండి. ఒకవేళ, ఏదైనా తీరని కోరిక మీతో పంచుకుంటే, అది పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పిల్లలకు స్వీట్లు పంచడం, పేదలకు సహాయం చేయడం, వంటివి చేయండి. తర్పణం చేయకపోతే ఇప్పుడు చేయటం మరవకండి.
#3 చనిపోయిన వ్యక్తి మీ కలలో కనబడి ఏదైనా పని చేయమని అడిగితే, వారు చెప్పిన పని పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అలాగే అతని పేరు మీద దానధర్మాలు చేయండి.
#4 ఒకవేళ చనిపోయిన వ్యక్తి మీ కుటుంబ సభ్యుడే మీ కలలో కనపడితే, అది చాలా శుభప్రదమని మరవకండి.
#5 చనిపోయిన బంధువులు ఆకలితో ఉన్నట్లు కనిపిస్తే, వెంటనే పేదలకు ఆహారం, బట్టలు, బూట్లు మరియు చెప్పులు దానం చేయండి.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!