Advertisement
మానవుడు ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడు. ఆ మానవుని మనసు తెలుసుకోవడం చాలా కష్టం. అయితే…ముక్కు ఆకారం, నిద్రించే భంగిమలే కాదు, కూర్చునే భంగిమను బట్టి కూడా వ్యక్తిత్వ లక్షణాలు పసిగట్టవచ్చు అట. నిపుణులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మనం కాళ్లను పెట్టుకునే విధానాన్ని బట్టి వ్యక్తిత్వం వెల్లడవుతుంది. సహజంగా కూర్చున్నప్పుడు మన పాదాలు, కాళ్ళను ఎలా ఉంచుతాము దాని ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు.
Advertisement
1 మోకాళ్ళను నిటారుగా మధ్యలోకి తీసుకొచ్చి కూర్చుంటున్నారా..
ఇలాంటివారు తమ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు. తమపై తాము సానుకూల దృక్పథంతో తెలివిగా, హేతుబద్ధంగా నడుచుకుంటారు. రోజు వారి జీవితంలో సమయానికి కట్టుబడి ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలరు.
2. మోకాళ్ళను వేరుగా చేసి కూర్చుంటున్నారా..
వీళ్లు తమ గురించి గొప్పగా ఆలోచిస్తారు. స్వార్థం ఉంటుంది. ఆందోళన కలిగించే వ్యక్తిగా, అయోమయానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. తాము తెలివిగా మాట్లాడుతున్నామని భావించి సాధారణంగా మాటల పర్యవసానాలను పట్టించుకోరు.
Advertisement
3. కాలు మీద కాలేసుకుని కూర్చుంటే..
ఒక కాలిపై మరో కాలు వేసుకొని కూర్చుంటే.. సృజనాత్మకత ఉంటుందని, వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉంటూ కలలు కనే వాడని చెబుతున్నారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం రక్షణాత్మక వైఖరిని వెల్లడిస్తోంది. పాదం ఎదురుగా ఉన్న వ్యక్తి దిశలో ఉంటే నమ్మకం గా మాట్లాడుతున్నారని అర్థం.
4. యాకిల్డ్ క్రాస్డ్..
ఈ పొజిషన్ లో కూర్చుంటే రాయల్టీ లాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటూ చుట్టూ ఉన్న వారిని ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేయగల సామర్థ్యం మీకు ఉంది. మీ ప్రదర్శనపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ రహస్యాలను బయటకు పోనివ్వరు.
5. ఫిగర్ ఫోర్ లెగ్ లాక్..
ఇలా కూర్చునేవారు ఆశావాద, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కోరికలను నెరవేర్చుకునే పనిలో లక్ష్యాలను చేరుకునే వరకు తెలివిగా వ్యవహరిస్తారు. డ్రెస్సింగ్ తో పాటు అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. మరొకరి అభిప్రాయంతో ఏకీభవించడానికి నిరాకరిస్తారు.
ALSO READ;
అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?