Advertisement
Sivaji Wife and Family: సినీ నటుడిగా పాపులర్ అయిన శివాజీ బిగ్ బాస్ సీజన్లో తోటి కంటెస్టెంట్స్ తో పోటీ పడి ఫైనల్స్ వరకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆటలో ఓడిపోయినా.. మెరుగైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శివాజీ. ప్రస్తుతం శివాజీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన శివాజీ ఆ తరువాత చాలా సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ఆ తరువాత మళ్ళీ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తొంభైకి పైగా సినిమాల్లో నటించిన శివాజీ కెరీర్ లో హిట్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
Advertisement
నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివాజీ ఉన్నట్లుండి సినిమాల నుంచి తప్పుకుని పొలిటికల్ రంగంలోకి వచ్చారు. మొదట టీడీపీ, బీజేపీ పార్టీలను తిట్టిన శివాజీ ఆ తరువాత టీడీపీ పార్టీకే దగ్గరయ్యాడు. ఆ తరువాత బీజేపీ పార్టీని తిట్టడం స్టార్ట్ చేసారు. గరుడ పురాణం పేరిట బీజేపీ టీడీపీ పార్టీ పై ఏ విధంగా కక్ష తీర్చుకోబోతోంది అన్న పేరిట ఓ అనాలసిస్ చెప్పుకొచ్చారు. దీనితో టీడీపీ ప్రత్యర్థులంతా ఆయన్ను గరుడ పురాణం శివాజీ అంటూ ఎద్దేవా చేసేవారు. ఈ క్రమంలోనే వైసీపీ వర్గాలు ఆయన్ను విమర్శించేవి. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం, వావి వరసలు లేక.. చెల్లెల్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అంటూ విమర్శించారు..
Advertisement
ఓ మీడియా డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఓ వ్యక్తి శివాజీని ఈ విషయం గురించి నేరుగా ప్రశ్నించారు. చిన్నమ్మ కూతుర్ని లేపుకుపోయావు అంటూ ఆ కాలర్ ప్రశ్నించేసరికి ఫుల్ ఫైర్ అయిన శివాజీ.. మరోసారి ఆ విషయం గురించి మీడియా ముందే క్లారిటీ ఇచ్చారు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నా బంధువే కాదని, మా ఇద్దరిది ఒక క్యాస్ట్ కూడా కాదని అన్నారు. నాది ఏపీ అయితే.. ఆ అమ్మాయిది తెలంగాణ అని, మా ఇద్దరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పుకొచ్చారు. ఓ ఫంక్షన్ లో మేము ఇద్దరం కలిసాం అని, మేము ఇష్టపడడంతో మా పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసారని అన్నారు.