Advertisement
ప్రేమ అనే రెండు పదాల్లో ఏముంటుందో తెలియదు కానీ దీని మత్తులో పడి జీవితంలో పైకొచ్చిన వారు ఉన్నారు, మొత్తం జీవితాలు నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ఇందులో కొన్ని ప్రేమలు అలాంటి సుఖాలు తీర్చుకునే వరకు ఉంటాయి, కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తున్నాయి. ఇలాంటి వాటిలో ఓ ప్రేమ వ్యవహారం గురించి ఇప్పుడు చూద్దాం..సంగారెడ్డి జిల్లా పటాన్ చేరులో బీటెక్ చదివిన యువతి ప్రియుడు చేతిలో మోసపోయానంటోంది..
Advertisement
also read: లైఫ్ పాట్నర్తో గొడవపడ్డాక ఈ తప్పులు చేస్తున్నారా.? బంధం విడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త..
రామచంద్ర పురానికి చెందిన వినూత్నేశ్వరి పటేల్ గూడా లోని ఎల్లంకి కాలేజీలో బీటెక్ చేస్తోంది. అమీన్పూర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఈర్ల దేవానంద్ రెండవ కుమారుడు ఈర్ల ప్రశాంత్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అలా వారి ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రశాంత్ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తట్టుకోలేక విష పదార్థాలు తీసుకొని ఆ**త్యాయత్నానికి ప్రయత్నం చేసింది.
Advertisement
also read: Tollywood Actress Laya: ముకేశ్ అంబానీకి హీరోయిన్ లయ బంధువా ?
వెంటనే ఆమెను పటాన్ చెరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నా కానీ ప్రియుడు ప్రశాంత్ తో వివాహం జరిపించాలని కోరుతోంది. ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడు తండ్రి పలుకుబడి చూసుకొని ఈ అమ్మాయి ఇంటికి వచ్చి తన కొడుకును వదిలేయాలని బేరసారాలు కూడా చేశారట. కానీ దీనికి యువతి ససేమీరా అంటోంది.. మరి చూడాలి యువకుడు ఆ అమ్మాయిని డబ్బులతో కొంటాడా లేదంటే పెళ్లి చేసుకుంటాడా అనేది ముందు ముందు తెలుస్తోంది.
also read: ఎండాకాలంలో మిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. సింపుల్ టిప్స్..!!