Advertisement
Konidela Upasana: అల్లు ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మధ్య అభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి అంతా బానే ఉంది కదా అని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటిదాకా మెగా వారసలు అభిమానులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మనకి కనపడింది. సోషల్ మీడియా వేదికగా మెగా పెద్ద యుద్ధం చేస్తున్నారు. మెగా అభిమానులకి ఎప్పటికప్పుడు అల్లు ఫాన్స్ సవాల్ విసురుతున్నారు. అలాగే జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కి అండగా నిలచారు. ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు.
Advertisement
నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేయడమే కాకుండా ప్రచారం కూడా చేశారు దీని తర్వాత అల్లు అర్జున్ ని ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో మండిపడ్డారు. బన్నీ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ని కూడా డిలీట్ చేసేసారు. దీంతో వివాదం ఇంకాస్త ముదిరింది. మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఆర్మీ గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
Advertisement
Also read:
పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమాధానం చెబుతున్నారు. జూలై 20న మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు జరిగింది. లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు పలువురు సెలబ్రిటీలు ఉపాసనకి విషెస్ చెప్పారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మాత్రం ఆమెకు విషెస్ చెప్పలేదు. ఇప్పుడు అది హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనలో ఇంకోసారి మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు తెరమీదకి వచ్చాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!