Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరును సంపాదించిన నటులలో మహానటి సావిత్రి తర్వాత అదే క్రేజ్ ను, పాజిటివ్ ఇమేజ్ ను సంపాదించుకున్న నటుల్లో సౌందర్య కూడా ఒకరు. ఈమె చూడ్డానికి ఎంతో అందంగా, పద్ధతిగా కనపడుతుంది. ఎన్నో మంచి పాత్రలను చేసి మంచి పేరును సంపాదించుకుంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలను చేసి గొప్ప స్టార్ గా ఎదిగింది. ఈమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఈ సినిమాను చేసింది.
Advertisement
సౌందర్య కర్ణాటకకు చెందింది. అయినా సరే తెలుగులోనే ఈమె పెద్ద స్టార్ గా నిలిచింది. సౌందర్య తండ్రి కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు పొందిన నిర్మాత మరియు రైటర్. సౌందర్య కి సినిమా రంగం ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పడంతో ఆమె నటిగా మారింది. కొన్నాళ్ళకి సౌందర్య తండ్రి మరణించడంతో అతని లెజసీని కంటిన్యూ చేయడానికి సత్యం మూవీ మేకర్స్ అనే పేరుతో సంస్థను స్థాపించి ద్వీప అనే చిత్రాన్ని నిర్మించింది.
Advertisement
Also read:
ఈ సినిమా 2002 లో విడుదల అయింది. ఈ చిత్రానికి గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించగా, సౌందర్య కూడా కీలక పాత్రలో పోషించారు. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. అయినా సరే ఈ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. అయితే మంచి విజయాన్ని పొందకపోవడంతో ఈమె మళ్లీ నిర్మాతగా వ్యవహరించలేదు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!