Advertisement
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎంతో టాలెంట్ తో పాటు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ తరువాత సక్సెస్ వస్తే వరుస ఆఫర్లు వస్తాయి. కానీ అలా ఎంతో కష్టపడి సినిమాల్లో సక్సెస్ అవుతున్న క్రమంలోనే కొంతమంది టాలీవుడ్ స్టార్ లు రకరకాల కారణాలవల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్ ఆల్ టైమ్ క్లాసిక్ నువ్వు నాకు నచ్చావ్‌తో అరంగేట్రం చేసి, అనతికాలంలోనే టాలీవుడ్‌లో భారీ పేరు తెచ్చుకున్న ఆర్తి అగర్వాల్. ఆమె సీనియర్ మరియు యువ తెలుగు హీరోలందరితో సినిమాలు చేసింది మరియు 31 సంవత్సరాల వయస్సులో లైపోసక్షన్ సర్జరీ వైఫల్యంతో మరణించింది.
# ఉదయ్ కిరణ్
చిత్రమ్, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో యూత్‌ఫుల్ హిట్‌లు అందుకున్న ఉదయ్ కిరణ్… మానసిక కుంగుబాటు, వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకుని 33 ఏళ్ల వయసులో మరణించాడు.
# పునీత్ రాజ్‌కుమార్
పునీత్ రాజ్‌కుమార్ కన్నడ సినిమా పవర్‌స్టార్. జిమ్ చేస్తూ గుండెపోటుతో మరణించారు. అతను చైల్డ్ ఆర్టిస్ట్ మరియు ప్రధాన నటుడిగా దాదాపు 100 సినిమాలు చేసాడు.
# సౌందర్య: మరో సావిత్రి లా చక్రం తిప్పుతుంది అనుకున్నారు. చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి. కానీ 34 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.
Advertisement
# ప్రత్యూష: వరుసగా మంచి అవకాశాలు అందుకుంటున్న టైం లో ఈమె మరణించింది. కొంతమంది ఈమెపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
# దివ్యభారతి: స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకున్న టైములో ఈమె మరణించింది. 19 ఏళ్లకే ఈమె మరణించడం విషాదకరం.
# యశోసాగర్: ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రం హీరో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న టైములో అది 25 ఏళ్లకే మరణించాడు.
#శ్రీహరి
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మంచి మనిషిగా నటించిన మంచి నటుడు శ్రీహరి. శ్రీహర్ 49 ఏళ్ల వయసులో కిడ్నీ ఫెయిల్యూర్‌తో మరణించారు.
#సిల్క్ స్మిత
సౌత్ ఇండియాలో హాట్ నటిగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత.. 36 సంవత్సరాల వయస్సులో మరణించింది. ఆమె మరణం ఇప్పటి వరకు మిస్టరీగా ఉంది.
#కునాల్
ప్రముఖ తమిళ చిత్రం కాదలర్ దినం (ప్రేమికుల రోజు)తో పేరుగాంచిన నటుడు కునాల్ కునాల్ వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
read also : షాపింగ్ మాల్స్ లో ఫుడ్ కోట్స్ టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?