Advertisement
శ్రీదేవి భారతీయ సినీనటి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము, అభినయం, నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఈమె తమిళనాడులోని శివకాశిలో జన్మించింది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో తాను బస చేసిన హోటల్ గది స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తు మునిగి మరణించింది.
Advertisement
ఇది ఇలా ఉండగా నిర్మాత బోని కపూర్ తో పెళ్లయ్యాక 1997 లో నటనకు కాస్త విరామం చెప్పారు. ఆ తర్వాత 2012లో ఇంగ్లీష్- ఇంగ్లీష్ చిత్రంతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చింది. ఈ సినిమాలో ఒక సగటు మహిళగా, తల్లిగా, ఇంగ్లీష్ నేర్చుకునే గృహిణిగా శ్రీదేవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. శ్రీదేవికి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా విడుదలై అక్టోబర్ 10 తో పదేళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో అతిలోకసుందరికి ఘనంగా నివాళి అర్పించేందుకు సిద్ధమవుతోంది ఆ చిత్ర బృందం.
Advertisement
ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్రణాళికలు రచిస్తోంది. ఈ మూవీ 10వ వార్షికోత్సవం నిర్వహించడంతోపాటు ఇంగ్లీష్-ఇంగ్లీష్ సినిమాలో శ్రీదేవి ధరించిన చీరలు వేలం వేయాలని అనుకుంటున్నట్టు గౌరీ తెలిసింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే ఆమె చీరలను ఎక్కడ వేలం వేయనున్నారు? ఎలా కొనుగోలు చేయాలన్న విషయాలను త్వరలోనే తెలుపుతామని గౌరీ తెలిపింది.
Read also : ఎన్టీఆర్ ట్రస్ట్ వివాదంపై ఎన్టీఆర్ కి రాసిన ఓపెన్ లెటర్ ! అతను చెప్పేది నిజామా కాదా ?