Advertisement
Sri Hari and Ram Charan: రియల్ స్టార్ శ్రీహరి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విలక్షణతకు పెట్టింది పేరు శ్రీహరి. తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన మంచి మనిషిగా కూడా అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో నెగటివ్ రోల్స్ పోషించి తరువాత విలన్ గా కూడా చేసి మెప్పించాడు. అంతేనా తర్వాత హీరోగా కూడా మారి పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో దేశభక్తి సినిమాలు, సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ఉన్న చిత్రాలలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
Advertisement
Read also: VENU SWAMY WIFE NAME: వేణు స్వామి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?
కెరీర్ హ్యాపీగా సాగుతున్న తరుణంలో తీవ్ర అనారోగ్యంతో 2013 అక్టోబర్ 9న కన్నుమూయడంతో అటు శ్రీహరి కుటుంబం, ఇటు రియల్ స్టార్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల క్రితం రామ్ చరణ్ గురించి శ్రీహరి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలలో మగధీర చిత్రం ఒకటి. ఈ మూవీ 2009లో జూలై 30న విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. అయితే ఈ చిత్రం గురించి ఆడియో ఫంక్షన్ లో శ్రీహరి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Advertisement
అవేంటంటే.. ” రాజమౌళి మగధీర కథ నాకు చెప్పినప్పుడే నేను సినిమాని ఊహించాను. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి గర్వం. అల్లు అరవింద్ గారికి వంద సినిమాలు తీసిన కీర్తి ఈ సినిమా తీసుకొస్తుంది. రామ్ చరణ్ ఎన్నటికైనా గ్లోబల్ స్టార్ అవుతాడు. ఈ సినిమా తర్వాత ఒక ఏడాది రెస్ట్ తీసుకో చరణ్. మార్షల్ వంటి ఆర్ట్ పై ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ కి వెళ్ళిపో. దీని తర్వాత తొందరపడి సినిమా చేయవద్దు. ఈ సినిమా తరువాత నేను రిటైర్ అయిపోతాను.. ఇక సినిమాలు చేయనని దిల్ రాజు గారికి చెప్పాను. మగధీర సినిమాలో నాకు రాజమౌళి గొప్ప క్యారెక్టర్ డిజైన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను అమెరికా వెళ్ళినప్పుడు నయాగరా ఫాల్స్ గురించి ఏదో అనుకున్నాను. కానీ ఆ తర్వాత దాన్ని చూసి నా జన్మ ధన్యం అయిపోయింది.
Read also: RAJINIKANTH WIFE LATHA LOVE STORY: రజినీకాంత్ జీవితం మారిపోవడానికి భార్య లతా చేసిన ఒక్క పని ఏంటంటే ?
అలాంటి ఫీలింగ్ మగధీర సినిమా చూస్తే కలుగుతుంది. మగధీర సినిమాలో.. ‘ భైరవ.. కమ్ముకుంటున్న ఈ కారుచీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా.. నువ్వు ఉదయించే సూర్యుడివని వాటికి తెలియదు. ఈరోజు నువ్వు అస్తమించొచ్చు గాక.. కానీ ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కడుపులు చీల్చుకుంటూ మళ్లీ పుడతావురా భైరవ” అని సినిమాలోని ఆయన డైలాగ్ ని విడుదలకు ముందే చెప్పి అభిమానులలో ఉత్సాహాన్ని తీసుకువచ్చారు శ్రీహరి. రామ్ చరణ్ ఎన్నటికైనా గ్లోబల్ స్టార్ అవుతాడు అని మగధీర ఆడియో ఫంక్షన్ లో ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఆ సినిమా సూపర్ ఇట్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం శ్రీహరి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read also: భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్…!