Advertisement
సినిమా ఇండస్ట్రీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. ఒక సినిమా సక్సెస్ కొట్టాలంటే కథతోపాటు గా, హీరో హీరోయిన్ల నటన, ప్రత్యేకంగా మ్యూజిక్, ఇతర పాత్రలు అన్ని కలగలిపి బాగుండాలి. ఇన్ని ఉన్నా సినిమా విడుదలయ్యాక హిట్ అవుతుందని భావిస్తారు. కానీ ఒక్కోసారి వారి అంచనాలు తారుమారు అవుతూ సినిమా రిజల్ట్ బెడిసి కొడుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు మూవీకి ఎంతో కనెక్టు అయినా కానీ చివరికి నిర్మాతలకు నష్టాలను మిగులుస్తాయి. ఇప్పటివరకు మనం చూసిన సినిమాల్లో సినిమా బాగా హిట్ అవుతుందని అనుకున్నా చివరికి అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో మీరు ఓ లుక్కేయండి..
Advertisement
జానీ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ జానీ. ఈ సినిమా అభిమానులకు ఎంతో కనెక్ట్ అయినా కానీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.
విరాట పర్వం :
సాయి పల్లవి,రానా ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. నక్సలిజం బ్యాక్గ్రౌండ్ తో తెరకెక్కిన ఈ మూవీ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఖలేజా :
ఒక సినిమా హిట్ అవ్వాలంటే దానికి ఏమేమి ఉండాలో అన్నీ ఈ మూవీకి ఉన్నాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అయిపోయి సినిమా హిట్ అవుతుందని భావించారు. కానీ చివరికి అంచనాలన్నీ తారుమారై సినిమా ప్లాప్ గా నిలిచింది.
అ:
Advertisement
ప్రయోగాత్మకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, అభిమానులకు కొత్తదనాన్ని పరిచయం చేసింది. సినిమా హిట్ అవుతుందని అనుకున్న చివరికి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
డియర్ కామ్రేడ్ :
విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న కాంబినేషన్ లో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఈ నగరానికి ఏమైంది:
ఈ సినిమా చూస్తే నవ్వు ఆపుకోకుండా నవ్వేస్తారు. ఇందులో ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయింది. అలాంటి మూవీ హిట్ కాలేదు.
అంటే సుందరానికి:
కొత్త కథను పరిచయం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
వేదం :
క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చివరికి ఫ్లాప్ అయింది.
నేనొక్కడినే :
సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ, ప్రేక్షకులకు ఏమీ అర్థం కాక డిజాస్టర్ గా మిగిలింది.
ALSO READ:
మగధీర సినిమాలో ఈ సీన్ ను చూస్తే ఒక డౌట్ రావాలి, మీకు వచ్చిందా?