Advertisement
వినాయక చవితి పండగ అయిపోయింది. నవరాత్రుల సమయంలో వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో గణపతి బప్పా మోరియా అని అంటారు. అయితే అసలు మోరియా అంటే ఏంటి దాని వెనుక కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే ఒక సాధువు ఉండేవాడు. అతను పూణెకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించువాడి గ్రామంలో ఉండేవాడు. ఆ సాధువు గణపతికి పెద్ద భక్తుడు. ఒకరోజు గణపతి సాధువు కలలోకి వచ్చారు. నదిలో వినాయకుడి విగ్రహం ఉంటుందని ఆ సాధువుకి వినాయకుడు కలలో వచ్చి చెప్పారు.
Advertisement
గణపతిని పూజించడానికి మోరియా చించివాడి నుంచి రోజు కాలినడకన మోరేగావ్ దాకా వెళ్లేవాడు. వచ్చిన కల ప్రకారం నది వద్దకు వెళ్లారు. నిజంగానే అక్కడ గణపతి విగ్రహం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడ వాళ్ళందరూ మోరియాని చూడడానికి వెళ్లారు. ఆయన చాలా గొప్పవాడు. అందుకే అతనికి కలలో వినాయకుడు కనపడ్డారని అంటారు.
Advertisement
Also read:
అతనిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అలా అందరూ అతని కాళ్లు మొక్కి మోరియా అనడం మొదలుపెట్టారు. నదిలో దొరికిన విగ్రహాన్ని మోరియా గుడి కట్టి ప్రతిష్టించారు. అయన గొప్ప భక్తుడని అందుకని వినాయకుని ఉత్సవాల్లో మోరియా పేరు పలుకుతారు. నిమజ్జన సమయంలో గణపతి బప్పా మోరియా అనడం జరుగుతుంది ఎప్పటినుంచో ఇలా అనడం మనం వింటున్నాం. ఇంకా ఇది కొనసాగుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!