Advertisement
నిన్నటి తరం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల హవాని మొదలుపెట్టి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఘనత ఆమెది. హీరోలకు ధీటుగా యాక్షన్ సన్నివేశాలను చెయ్యడంలో కూడా ఆమె ముందుంటారు. అందుకే ఆమె అభిమానులు ఆమెను ముద్దుగా లేడీ అమితాబ్ అని పిలుచుకుంటారు.
Advertisement
సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అవుతోంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాతో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా ఆమె ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఆమెకు ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితము గురించి చాలా మందికి తెలియదు. విజయశాంతి జూన్ 24, 1966లో జన్మించారు. ఆమె అసలు పేరు “శాంతి”. అయితే ఆమె తన పేరులో విజయ అన్న పేరుని కూడా యాడ్ చేసుకోవడానికి పెద్ద కారణమే ఉందట.
Advertisement
ఆమె తన 7 వ సంవత్సరంలోనే బాల నటిగా ఎంట్రీ ఇచ్చారు. అయితే.. ఆమె దర్శకుడు భారతీ రాజా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆమె తన పిన్ని విజయ లలిత పేరు లోంచి విజయ అనే పేరుని తన పేరులో కలుపుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెపై ఉన్న విశేషమైన అభిమానంతోనే విజయశాంతి తన పిన్ని పేరుని కూడా తన పేరులో కలుపుకున్నారు. అయితే.. ఈ పేరుతొ హీరోయిన్ గా పరిచయం అయ్యాక వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగు లోను, తమిళ్ లోను వరుస అవకాశాలతో దూసుకెళ్లారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక మెదక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. సినిమా రంగంలో ఆమె తిరుగులేని సక్సెస్ సాధించినప్పటికీ.. ఆమె రాజకీయ జీవితం మాత్రం అంతగా రాణించలేదనే చెప్పొచ్చు.
మరిన్ని..
Saripodha Sanivaaram Movie Heroine, Cast, Director Crew: సరిపోదా శనివారం మూవీ టీం
Ashtadasa Shakti Peethas List: 18 అష్టాదశ శక్తి పీఠాలు మరియు వెలసిన ప్రదేశాల వివరాలు