Advertisement
అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు.. అత్త మీద కోసం అల్లుడికి శాపంగా మారింది. ఇదేమైనా సామెత అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పు కాలేసినట్టే.. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అత్యంత కీలక పరిణామాల్లో ఇదో కీలక విషయంగా చెప్పుకోవచ్చు. నైఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన 105 స్థానాల్లో ఓ విషయంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రకటించిన 115 స్థానాల్లో టికెట్ దక్కని ఖానాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడికి సంబంధించిన విషయం ఇది.
Advertisement
Advertisement
ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భూక్యా జాన్సన్ రాథోడ్ కి టికెట్ కేటాయిస్తూ తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ టికెట్ దక్కలేదని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. మరో 40 రోజులపాటు బీఆర్ఎస్ లో కొనసాగుతానని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థన కూడా చేసుకున్నారు. ఆమె భర్త ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. త్వరలో ఈమె కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ప్రస్తుతం రేఖా నాయక్ అల్లుడు మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ ని తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ గా నియమిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్త కాంగ్రెస్ లో జాయిన్ అయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన కొద్ది సేపటికే తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆమె కూతురుని చేసుకున్న ఐపీఎల్ శరత్ చంద్ర పవర్ ను బదిలీ చేసింది.