Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగిన గొప్ప నటుడు సుధాకర్ అని చెప్పవచ్చు. ఆయన ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ, విలనిజంతో మెప్పించారు. తెలుగు ఇండస్ట్రీ కంటే ముందే తమిళ ఇండస్ట్రీలో సుధాకర్ స్టార్ హీరోగా చేసి చివరికి అణిచివేయబడి కమెడియన్ గా మారడానికి కారణాలు ఏంటో మరోసారి చూద్దాం.. దాదాపుగా ఆరు వందల సినిమాల్లో నటించిన సుధాకర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1990 వచ్చినటువంటి ప్రతీ చిత్రంలో ఆయన తప్పనిసరిగా ఉండేవారు.
Advertisement
దీన్ని బట్టి చూస్తే ఆ రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఆయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అవ్వడానికి కారణాలు.. 1977 లో చిరంజీవి సుధాకర్ ఒక యాక్టింగ్ స్కూల్ లో చేరారు. ఒకేసారి డిగ్రీ పుచ్చుకొని బయటకు వచ్చారు. యాక్టింగ్ స్కూల్లో ఉండగానే సుధాకర్ కి తమిళ ఇండస్ట్రీలో చాలా ఆఫర్స్ వచ్చాయి. చిరంజీవి కంటే ముందే వెండితెరపై సుధాకర్ స్టార్ హీరోగా ఎదిగారు. తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో చాలా బిజీ అయిపోయారు. అప్పుడు సుధాకర్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేది. తమిళంలో మూడేళ్లలోనే 45 సినిమాల్లో హీరోగా నటించారు. సుధాకర్ దూకుడుకు అప్పటి తమిళ స్టార్ హీరోలైన ఎంజీఆర్, శివాజీ గణేశన్ ముక్కన వేలు వేసుకున్నారట.
Advertisement
సుధాకర్ నూ ఇలాగే వదిలేస్తే వారి ఉనికికే ప్రమాదం వస్తుందని భావించి కొంతమంది అగ్రహీరోలు, నిర్మాతలు కలిసి సుధాకర్ ను మెల్లిమెల్లిగా తొక్కేయడం ప్రారంభించారని చెప్పుకుంటారు. ఆయన తమిళంలో చేసిన 45 సినిమాల్లో దాదాపుగా 30 సినిమాలు పైగా సూపర్ హిట్ లు. ఇందులో 18 సినిమాలు హీరోయిన్ రాధిక తోనే చేశారు. అప్పట్లో తమిళనాడులో సుధాకర్ రాధిక కాంబినేషన్ అంటే సంచలనమైన జంట. ఆ రోజుల్లో వీరి కాంబినేషన్ చూసి వీరిద్దరి వివాహం కూడా చేసుకుంటారని భావించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలుగువాడైనా సుధాకర్ ను సినీ ఇండస్ట్రీలో ఎదగకుండా చేశారని సుధాకర్ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. దీని తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్ గా స్థిరపడిపోయారు సుధాకర్.
also read: