Advertisement
ఇటీవల కాలంలో టీమిండియా సెలెక్టర్ల పై, వారి సెలక్షన్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా టీమిండియా సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలలో పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్ల వైపు ఎందుకు మొగ్గు చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న సర్పరాజ్ ఖాన్ ని టెస్ట్ జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై మండిపడ్డారు సునీల్ గవాస్కర్. సెలక్టర్లు క్రికెటర్లను ఆకారాన్ని బట్టి కాకుండా వారి ఫామ్ ని చూసి ఎంపిక చేయాలని సూచించారు.
Advertisement
Read also: అక్కినేని, తొక్కినేని అంటూ కామెంట్స్ పై సమంత రియాక్షన్ ఏంటంటే ?
స్లిమ్ గా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయాలనుకుంటే సెలక్టర్లు ఫ్యాషన్ షో కి వెళ్లి కొంతమంది మోడల్స్ ని ఎంచుకొని వారికి బ్యాట్, బాల్ ఇచ్చి ఆపై వారిని చేర్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో తొలి రెండు టెస్టులకు చేతన్ శర్మ సారధ్యంలోని సెలక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే రంజీ ట్రోఫీలలో వరుస సెంచరీలతో మంచి ఫామ్ లో ఉన్న సర్పరాజ్ ఖాన్ ను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్షన్ కమిటీ మాత్రం అతడిని పట్టించుకోలేదు. పరిమిత ఓవర్ల ప్రదర్శన ఆధారంగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను ఎంపిక చేసింది. సర్పరాజ్ ను ఎంపిక చేయకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.
Advertisement
ఈ క్రమంలోనే ఓ ఛానల్ తో మాట్లాడిన గవాస్కర్ సెలెక్టర్ల తీరును తప్పుపట్టారు. ” ఫిట్ గా లేకుంటే సెంచరీలు చేయలేరు. అందువల్ల క్రికెట్ లో ఫిట్నెస్ చాలా ముఖ్యం. మీరు యో – యో టెస్ట్ చేయాలనుకోవడంలో నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ యో – యో టెస్ట్ మాత్రమే ప్రామాణికం కాదు. ఆటగాడు క్రికెట్ కు సరిపోతాడు అనుకుంటే యో – యో టెస్ట్ ముఖ్యమైనదిగా భావించకూడదు. ఒక ఆటగాడు సెంచరీలు బాదుతున్నాడంటే అతడు క్రికెట్ ఆడటానికి ఫీట్ గా ఉన్నాడని అర్థం. మీకు స్లిమ్ గా ఉన్న క్రికెటర్లు మాత్రమే కావాలనుకుంటే ఫ్యాషన్ షో కి వెళ్లి కొంతమంది మోడల్స్ ని ఎంచుకొని, ఆపై వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులో చేర్చుకోండి. క్రికెటర్లు శారీరకంగా చాలా ఆకారాల్లో ఉన్నారు. ఆకారాన్ని బట్టి కాకుండా వారు చేసే పరుగులు, తీసే వికెట్ల ఆధారంగా ఎంపిక చేయండి” అని సునీల్ గవాస్కర్ చురకలంటించారు.
Read also: ఇదేందీ బండ్లఅన్న ? ఇదేందీ ఇది మధ్యలో చిరంజీవి ఎలా వచ్చారు …