Advertisement
తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చేసిన సినిమాలు ఓ మైలురాయి. ఇప్పటి సినీ లోకానికి ఆయన చేసిన ప్రయోగాలే మార్గనిర్దేశాలు. 50 ఏళ్ల క్రితం పాన్ వరల్డ్ సినిమా తీసిన లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ. ఈయన అద్భుత నటన గురించి, ఈయన వ్యక్తిత్వం గురించి ఎంత వర్ణించినా అది తక్కువే. కాగా ఆ అందాల నటుడు అభిమాన తార నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణాంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణ ఇమేజ్ తో పోల్చితే ఆయన సంపాదించిన ఆస్తులు తక్కువేట. ఆయన, సినిమాల గురించే ఆలోచిస్తూ డబ్బును పట్టించుకోకపోయేవారట.
Advertisement
తొలి చిత్రం తేనె మనసులు సినిమాకు రూ. 2 వేలు రెమ్యునరేషన్ తీసుకున్నారు కృష్ణ. స్టార్ డమ్ వచ్చిన ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయని కృష్ణ, నిర్మాతలు ఎంతిస్తే అంతే తీసుకునేవారు తప్ప, అడగకపోయేవారట. 35 సినిమాల తర్వాతే కృష్ణ రెమ్యూనరేషన్ రూ. 10 దాటిందట. అయితే, కృష్ణ ఆస్తుల విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, బుర్రిపాలెం తో పాటు హైదరాబాద్, చెన్నైలో ఇల్లు, ఫామ్ హౌస్ లు ఉన్నాయట. కృష్ణ గ్యారేజీలో రూ. 20 కోట్ల విలువ చేసే ఏడు కార్లు ఉన్నాయి.
Advertisement
వందల చిత్రాలు, స్టార్ డమ్ ఉన్నా, కృష్ణ గారు మాత్రం భారీగా ఆస్తులు కూడబెట్టుకోలేదట. అయితే, మహేష్ సక్సెస్ అయ్యాక ఆర్థికంగా నిలదొక్కుకుంది కృష్ణ ఫ్యామిలీ. డబ్బు విషయంలో అమాయకత్వం, సెటిల్మెంట్స్ విషయంలో మధ్యవర్తిగా ఉండటం, కీలక సమయంలో కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో కోట్లాది రూపాయలను కృష్ణ నష్టపోయారు. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించే చిత్రాలు, సీరియల్ విషయంలో కృష్ణ ఎక్కువగా తన సోదరులు హనుమంతరావు, శేషగిరి రావులపైనే ఆధారపడేవారు. అలా ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోయారు కృష్ణ. అయితే ఇవన్నీ జరగకపోయి ఉంటే ఆయన ఆస్తి సుమారుగా రూ. 500 కోట్లకు పైగా ఉండేదని అంచనా, కానీ ఈయన వారసుడు మహేష్ బాబు మాత్రం ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా ఆస్తులు కూడపెట్టినట్లు సమాచారం.