• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » కృష్ణ ఈ సినిమా టికెట్ల కోసం 12 కీ. మీ. లైన్ కట్టారట.. అప్పట్లోనే కోట్లు వసూలు చేసింది..!!

కృష్ణ ఈ సినిమా టికెట్ల కోసం 12 కీ. మీ. లైన్ కట్టారట.. అప్పట్లోనే కోట్లు వసూలు చేసింది..!!

Published on September 1, 2022 by mohan babu

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారు ఉండరు. ఆయన నటించిన అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీకి అనేక టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత కృష్ణ గారి సొంతమని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో మొదటి కలర్ సినిమా తీసింది, మొదటి గూడచారి మూవీ స్ ను తీసింది కూడా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. ఈ విధంగా సూపర్ స్టార్ పేరిట అనేక రికార్డు నెలకొన్నాయి. ఈ విధంగా కృష్ణ సినీ జీవితంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సినిమాల్లో సింహాసనం మూవీకి ప్రత్యేకత ఉంది. అప్పట్లో ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డు అంతా ఇంతా కాదు. అప్పటి సింహాసనం సినిమా, ఇప్పటి ప్రభాస్ బాహుబలి తో పోల్చవచ్చు. ఆ సమయంలో ఈ మూవీ ఒక చరిత్ర తిరగరాసింది. కృష్ణకు జానపద చిత్రాన్ని తీయాలని ఉండేదట.

దీంతో సింహాసనం మూవీని ప్రారంభించారు. కానీ ఈ మూవీకి బడ్జెట్ మూడు కోట్ల యాభై లక్షలు పెట్టి తీయాలి అనుకున్నారట. కానీ మూవీ హిట్ కాకుంటే నిర్మాతలు భారీగా నష్టపోతారని భావించి, దీంతో ఆయనే స్వయంగా తన సొంత స్టూడియో బ్యానర్ పై మూవీని నిర్మించారట. ఈ సినిమాకు కృష్ణ గారే దర్శకత్వం వహించి మూవీ పూర్తి చేశారు. ఈ మూవీ తీస్తున్న టైంలో సినిమా గురించి నిత్యం పేపర్లలో షూటింగ్ విషయాలు పడడం వల్ల, దీంతో ఈ మూవీపై అప్పట్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సమాజంలో కూడా ఈ మూవీ పై అవగాహన కలిగింది. ఈ మూవీలో బాలీవుడ్ నటి మందాకిని,రాధా,జయప్రద నటించారు. ఈ మూవీ షూటింగ్ త్వరగా యాభై మూడు రోజుల్లోనే పూర్తి చేశారు. ఆ సమయంలో ఒక సినిమా తీయాలంటే యాభై లక్షల బడ్జెట్ దాటేది కాదు.

Advertisement

కానీ ఈ మూవీని కృష్ణ ఏకంగా 3.50 కోట్ల రూపాయలకు తీసి పెద్ద సాహసమే చేశారు. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా హిందీలో కూడా చిత్రీకరించారు. కానీ హిందీలో జితేంద్ర హీరోగా నటించారు.1986 మార్చి 21 సినిమా థియేటర్ లోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో, సినిమా టికెట్ల కోసం దాదాపుగా 12 కిలోమీటర్ల లైన్లు ఉన్నాయి అంటే సినిమా ఏ రేంజ్ లో ప్రజల వద్దకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి వారంలోనే కోటి యాభై లక్షల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఒక్క థియేటర్లో 15 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. విశాఖపట్నంలో అయితే ఈ సినిమా వంద రోజులు ఆడిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమా ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ 100 రోజుల ఫంక్షన్ కు కృష్ణ ఫాన్స్ ఏకంగా 400 బస్సుల్లో వచ్చి అప్పట్లో చరిత్ర తిరగరాశారు.

also read:

Advertisement

యమగోల సినిమాలో ముందు బాలకృష్ణను హీరో అనుకొని.. తర్వాత తప్పించింది ఎవరు..!!

Related posts:

టాలివుడ్ లో స్టార్ హీరోల వల్ల నష్టపోయిన టాలెంటెడ్ హీరోలు వీళ్లే..! Default Thumbnailసూపర్ స్టార్ కృష్ణ ఆస్తుల తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..వీళ్లు అపర కుబేరులే ! super-star-krishna-rare-photosఇప్పటి వరకు ఎవ్వరూ చూడని సూపర్ స్టార్ కృష్ణ రేర్ అండ్ అన్ సీన్ ఫోటోస్..! Default Thumbnailఅవకాశాల కోసం వెళ్తే..సూపర్ స్టార్ కృష్ణ ను NTR అవమానించారా ? NTR అన్న మాటలివే

Latest Posts

  • Ys. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
  • భార్యను లాడ్జికి రప్పించి భర్త ఏం చేశాడో తెలుసా ?
  • పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?
  • భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
  • ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd