Advertisement
టి – 20 ప్రపంచ కప్ సెమీస్ లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల ఎదురుచూపులు ఫలించలేదు. 169 పరుగులను డిఫెండ్ చేసుకోలేక, కనీసం ఒక్క వికెట్ నైనా పడగొట్టలేక 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజం. అయితే, టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ దారుణంగా ఓడటాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. వచ్చే టి20 వరల్డ్ కప్ కు మరో రెండేళ్ల సమయం ఉండటంతో, అప్పటిలోగా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తోందని సమాచారం.
Advertisement
టి20 జట్టు నుంచి సీనియర్లను తప్పించి, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బోర్డు యోచిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుత జట్టులో 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటమే జట్టు ఓటమికే కారణం అని బీసీసీఐ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లని టి20 జట్టులోకి తీసుకోవద్దని బీసీసీఐ భావిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి.
Advertisement
అదే నిజమైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తో పాటు సూర్య కుమార్ యాదవ్ ను కూడా సెలక్టర్లు టి20 లకు పరిగణలోకి తీసుకోరు. గత ఏడాదే భారత్ తరపున టీ20లోకి అడుగుపెట్టిన సూర్య కుమార్ యాదవ్, అద్భుత ఫామ్ లో ఉన్నాడు. భారత తరపున పొట్టి ఫార్మాట్లో కీలక ఆటగాడిగా ఎదిగిన సూర్య, ఐసిసి టి 20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది వన్డేలు, టెస్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండటంతో, ఆటగాళ్లపై భారం పడకుండా, వారి ఫిట్నెస్ దెబ్బ తినకుండా చూడటం కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, టీమిండియా ఫ్యాన్స్ సూర్య కుమార్ యాదవ్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO : T20 WC 2022 : ఛాంపియన్ ఇంగ్లండ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? భారత్‌కు మరి!