Advertisement
Swag Review: శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవి బాబు, గెటప్ శ్రీను మరియు గోపరాజు రమణ తదితరులు ఈ సినిమాలో నటించారు. హసిత్ గోలి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ సాగర్ సంగీతం అందించారు. వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ అందించారు.
Advertisement
సినిమా: స్వాగ్
నటీనటులు: శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవి బాబు, గెటప్ శ్రీను మరియు గోపరాజు రమణ తదితరులు
దర్శకుడు : హసిత్ గోలి
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్
సంగీత దర్శకుడు : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : వేదరామన్ శంకరన్
రిలీజ్ డేట్: 04-10-2024
కథ మరియు వివరణ:
ఇక కథ విషయానికి వచ్చేస్తే.. స్వాగ్ వంశానికి చెందిన ఆస్తిని పంచుకోవడానికి రెండు జెండర్ల మధ్య కొంత పోటీ కనబడుతుంది. ముఖ్యంగా రెండు జెండర్స్ మధ్య జరిగే సంఘర్షణలో ఎవరికి ఆ వంశం తాలూకా ఆస్తి దక్కింది అనే పాయింట్ తో ఈ మూవీ ని తెరకెక్కించారు. ఎవరు విజయం సాధించారు అనేది తెలియాలంటే సినిమా చూడాలి దర్శకుడు ఇంతకుముందు శ్రీ విష్ణు తో రాజరాజ చోరా అనే సినిమా చేసి సక్సెస్ ని సాధించడంతో రెండో సినిమాను కూడా శ్రీ విష్ణు తో చేసే మంచి సక్సెస్ ని సాధించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ కథని డిఫరెంట్ వేరియేషన్ లో రాసుకునే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. పేపర్ మీద ఏదైతే రాసుకున్నాడో స్క్రీన్ మీద కూడా అలాంటి ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అందుకు తగ్గట్టుగా ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రయత్నం ముందుకు సాగుతోంది. ఇంటర్వెల్ లో వదిలేసారు.
Advertisement
సెకండ్ హాఫ్ ఎలా స్టార్ట్ చేస్తాడు అని అనుకున్నప్పటికీ డీసెంట్ గా స్టార్ట్ చేసి సినిమాని మరో యాంగిల్ లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ప్రీ క్లైమాక్స్ లో సినిమాని ఎంటర్టైనింగ్ గా ముగించాలనే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ గా నిలిచింది అని చెప్పొచ్చు. సెకండ్ పార్ట్ లో వచ్చే సీన్స్ ల్యాగ్ అయినప్పటికీ ఓవరాల్ గా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. వీకెండ్ ఫ్యామిలీతో సినిమా చూడలేనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు.
ఇక పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. అందరూ పాత్రలకు తగ్గట్టుగా బానే నటించారు శ్రీ విష్ణు మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమాని తన భుజాల మీద మోసుకెళ్లాడని చెప్పొచ్చు. నాలుగు పాత్రలలో కనిపించిన ఆయన తనదైన రీతిలో నటించారు. ఆయన కామెడీదో ప్రేక్షకులు విపరీతంగా నవ్వుతారు. రీతు వర్మ కూడా ఐకానిక్ రోల్ లో నటించి అందరిని మెప్పించింది. సునీల్, రవిబాబు, గెటప్ శీను కూడా పాత్రలకు తగ్గట్టు బానే నటించారు. టెక్నికల్ అంశాల విషయానికి వచ్చేస్తే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది.
Also read:
ప్లస్ పాయింట్స్
శ్రీవిష్ణు
స్క్రీన్ ప్లే
దర్శకత్వం
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్లడం
కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!