Advertisement
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఇండియా మరియు పాక్ జట్ల మధ్య కీలక పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ మెల్బోర్న్ లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిచి, పాక్ ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన ఉవ్వల్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్ కు ఉన్నంత క్రేజ్ మరే దానికి ఉండట్లేదు. దీన్ని ప్రత్యక్షంగా చూడటానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా ప్రేక్షకులకు వీక్షించడానికి సన్నద్ధం అయ్యారు. ఇదో రికార్డు.
Advertisement
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తి సామర్థ్యం లక్ష. లక్ష మంది ఒకేసారి మ్యాచ్ ను తిలకించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా టికెట్లు అమ్ముడయ్యాయి. 90 వేలకు పైగా టికెట్లను విక్రయించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇదివరకు చాలా అరుదుగా మాత్రమే ఈ స్థాయిలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తిస్థాయిలో నిండింది. మెల్బోర్న్ లో వర్షం పడే అవకాశం ఉందంటూ ఇదివరకే ఆస్ట్రేలియా వాతావరణం విభాగం-బ్యూరో ఆఫ్ మెటరాలజీ అంచనా వేసింది గాని, పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయి. వర్షం పడటానికి అనుకూల వాతావరణం ఇప్పుడు లేదు.
Advertisement
మ్యాచ్ కొనసాగడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. లానిన ప్రభావంతో మెల్బోర్న్ సిటీ మొత్తం మీద భారీ నుంచి అతి భారీ వర్షం పడవచ్చు అంటూ బ్యూరో ఆఫ్ మెటరాలజీ ఐదు రోజుల కిందటే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతం మీదుగా లాలిన విస్తరించిందని పేర్కొంది. వచ్చే నాలుగైదు రోజుల్లో ఇది మరింత విస్తృతం అవుతుందని వివరించింది. అదే జరిగితే మేల్ బోర్న్ గిలాంగులోని సైమండ్స్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడానికి అధిక అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
READ ALSO : మరోసారి జగన్ సీఎం కాకపోతే.. గెలిచినా రాజీనామా చేస్తా !