Advertisement
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చేంట్ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకి తెలిసిందే. పెళ్లి వేడుక కోసం ముఖేష్ అంబానీ ఏకంగా రూ. 5000 కోట్ల ఖర్చు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అంత ఘనంగా ఈ వివాహాన్ని జరిపించారు. ముఖేష్ అంబానీ ఈ వివాహ వేడుకలకు దేశ విదేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార, సినీ తదితర రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
Advertisement
బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో హీరోయిన్స్ వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది వేడుకల్లో కనిపించి అలరించారు. కొంతమంది డాన్స్ కూడా చేసి ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీలో ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఈ పెళ్లికి వచ్చారు. అలాగే చాలా మంది హాజరుకాలేదు. వాళ్ళలో తాప్సి కూడా ఒకరు. తాజాగా ఆమె పెళ్ళికి హాజరు కాకపోవడంపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Advertisement
Also read:
ఆమె మాట్లాడుతూ అనంత్ అంబానీ వివాహానికి వెళ్తున్నారా అని ఒక విలేకరి అడిగితే తాప్సీ మాట్లాడుతూ… ఆ పెళ్ళికి నేను వెళ్లట్లేదు. నిజం చెప్పాలంటే నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకుంటుంది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుభవం ఉండాలని నేను భావిస్తాను. అటువంటి వివాహాలకు మాత్రమే నేను హాజరవుతానని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా తాప్సీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!