Advertisement
Taraka Ratna Wife: టిడిపి పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్ర లో విషాదం చోటుచేసుకుంది. ఆ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి హీరో తారకరత్న గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఇప్పటికే ఆయనకు రెండుసార్లు గుండెపోటు వచ్చిందని, ఇది మూడోసారి అని బెంగళూరులో చికిత్స అందిస్తున్న వైద్యులు తెలియజేశారు. ఈ తరుణంలో ఆయనను ఎలాగైనా కాపాడుతామని మా శాయశక్తుల కృషి చేస్తామని వైద్యులు అంటున్నారు.
Advertisement
అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరో హెల్త్ బులిటెన్ బయటకు వస్తే గాని అసలు విషయం బయటకు రాదు. అయితే తారకరత్న ఇలా కావడానికి కారణం వరుస పర్యటనలలే అని తెలుస్తోంది. ఈ పర్యటన వల్ల బిజీ కావడంతో ఇలా జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులంతా బెంగళూరుకు వెళ్లినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు కూడా బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఒక క్రేజీ వార్త బయటకు వచ్చింది. తారకరత్నకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మధ్య బంధుత్వం ఉందని ఒక వార్త వినిపిస్తోంది.
Advertisement
విజయసాయిరెడ్డి భార్య సునంద, తన సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్యను నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారని, పెద్దలను ఎదిరించి సైతం హైదరాబాదులోని సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వివాహానికి బాలకృష్ణ ఒక్కరే అంగీకరించారని సమాచారం. అయితే అలేఖ్య ఫిలిం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. విజయసాయిరెడ్డి తారకరత్నకు మామగారు అవుతారు. తారక రత్న చేసిన సినిమాలు అన్ని ఆమె దగ్గరుండి చూసేవారు.
also read: