Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరత్న స్టార్ హీరోగా ఎదగక పోయినా సరే మంచి ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకున్నారు. ఆయన నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా సరే ఎప్పుడైనా ఎదుటివారిని గౌరవంతో మాట్లాడే మంచి వ్యక్తి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ ఒక్కరిని కూడా ఆయన కించపరిచింది లేదట. అంతటి గొప్ప గుణం కలిగిన తారకరత్నకు సినిమాలు అంతగా కలిసి రాకపోవడంతో రాజకీయాల్లో అయిన రాణిద్దామని అనుకున్నారట.
దీంతో నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురై నారాయణ హృదయాల ఆస్పత్రిలో 23 రోజులు చికిత్స పొంది శివరాత్రి పర్వదినాన మరణించాడు. అలాంటి తారకరత్న తన జీవితంలో అనుకున్నది సాధించక ముందే మృతి చెందడం చాలా బాధాకరం. అలాంటి తారకరత్నకు ఆ రెండు కోరికలు బలంగా ఉండేవట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన సొంతవాళ్లు ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వారు బ్రతికున్నప్పుడు ఏ ఏ కోరికలతో బ్రతికారో అవి నెరవేర్చడానికి వారి ఆత్మీయులు రెడీ అవుతుంటారు.
Advertisement
అలాంటి తారకరత్నకు కూడా రెండు కోరికలు బలంగా ఉన్నాయట. ఇందులో ఒకటి బాబాయ్ బాలయ్య సినిమాలో యాక్ట్ చేయాలని, మరొకటి తన రాజకీయ జీవితం మొదలుపెట్టే ఎమ్మెల్యేగా రాణించాలని కోరికలు ఉండేవట. ఈ విషయాలను తన భార్య అలేఖ్య రెడ్డికి తరచూ చెబుతూ ఉండేవారట తారకరత్న. ఇలా అతను అనుకున్న రెండు కోరికలు తీరకముందే ఆయన మరణించడంతో, ఆ రెండు నిజం చేసేందుకు తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.
Advertisement
also read: