Advertisement
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎన్.చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ చంద్రబాబు నాయుడు జైలు జీవితం గురించి చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాయుడు సెప్టెంబర్ 9న అరెస్టయ్యారు. ఆయన జ్యుడీషియల్ రిమాండ్ అక్టోబర్ 19 వరకు పొడిగించబడింది.
Advertisement
ఎక్స్ (ట్విట్టర్ లో) లో స్పందించిన నారా లోకేష్ సమావేశం గురించి మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు జైలులో “భయకరమైన స్థితిలో” జీవిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి అనేక కోట్ల రూపాయల కుంభకోణంపై 2021లో AP CID నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష నాయకుడిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడుకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి అంగీకరించని అమిత్ షా నేడు లోకేష్ ని కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు అధికం అయ్యాయి.
Advertisement
చంద్రబాబు అరెస్ట్ గురించి లోకేష్ అమిత్ షా తో మాట్లాడగా.. ఏమి జరుగుతోందో తనకి తెలుసు అని అమిత్ షా సమాధానం ఇచ్చారట. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ భేటీలో ఏమి జరిగిందో చెప్పుకొచ్చారు. ఏపీలో జరుగుతున్నా పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కోసమే లోకేష్ ఆయనను కలిసారని అన్నారు. ఈ విషయాలు తనకు తెలుసనీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనక తమ ప్రమేయం లేదని అమిత్ షా అన్నారన్నారు. పురంధేశ్వరి, కిషన్ రెడ్డి లోకేష్ తో కలిసి వెళ్లలేదని.. లోకేష్ వెళ్ళేసరికే అక్కడ పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కూడా ఉన్నారని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు.
మరిన్ని..
BJP Leader Ravi Kumar Yadav: తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!
Bathukamma 2023: Wishes, Festival Dates, Celebrations, Images, Songs, Pooja
మరో సీతారామం జంట..! ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుని.. యుద్ధం వచ్చేసరికి..?