Ads
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. కొందరు టిడిపి అభిమానులు తమ నిరసనను ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ఓ టిడిపి కార్యకర్త టీడీపీ జెండాతో తిరుమలలో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. టిడిపి అధినేత అరెస్ట్ కు వ్యతిరేకత చూపిస్తూ సదరు కార్యకర్త ఇలా జండాను పట్టుకుని నిరసన తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవి చదవండి : నటి సూర్యకాంతం భర్త ఎవరు.. ఏం చేసేవారు తెలుసా?
మరో వైపు ఆ కార్యకర్త తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పార్టీ జండాను ప్రదర్శించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఈ ఫోటోను పంచుకుంటూ తిట్టిపోస్తున్నారు. పవిత్ర స్థలంలో పార్టీ జండాను పెట్టి అపవిత్ర వ్యవహారాలు అంటూ మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటె ఈ ఫోటోలు తీసిన కార్యకర్త ఎవరు? ఏ సమయంలో జండాను పెట్టి ఫోటోలు తీశారు? అన్న వివరాలు తెలియరాలేదు.
Advertisement
ఇవి చదవండి :ఒక వెలుగు వెలిగి..ఆ తర్వాత కనుమరుగైన టాలీవుడ్ హీరోలు
స్వామి వారి పవిత్ర సన్నిధిలో ఇలా రాజకీయ పార్టీల జండాలను తీసుకొచ్చి అపవిత్రం చేస్తునందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ వైసీపీ గణాలు గొంతు విప్పుతున్నాయి. పలువురు వైసీపీ అభిమానులు సదరు కార్యకర్తపై చట్ట పరంగా చర్యలు తీసుకోవోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటివరకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించలేదు. తిరుమలలో శ్రీవారి నామస్మరణా తప్ప మరే ఇతర విషయాల గురించి రచ్చ జరగడానికి వీలు లేదు. ఈ క్రమంలో ఏకంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన జెండాను ప్రదర్శించడం కలకలం రేగడానికి కారణమైంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని: చాణక్య నీతి ప్రకారం ఈ 3 పనులు చేసుక తప్పక స్నానం చేయాలట ..! లేకుంటే ..!