Advertisement
ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ.. అంటే… ఒక మెరుపులాగా ఉండేది. అయితే.. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో టిడిపి ఉనికి లేకుండా పోయింది. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ పత్తానే లేదు. ఏదో పేరుకు మాత్రమే పార్టీ ఉంది గాని, సంస్థగతంగా అంటూ ఆ పార్టీకి బలం పోయింది. ఆ పార్టీ బలమంతా ఎక్కువ టిఆర్ఎస్ వైపుకు వెళ్ళగా, కొంచెం కాంగ్రెస్ వైపుకు వచ్చింది. తెలంగాణలో ఏదో గత ఎన్నికల్లో రెండు సీట్లు అయినా గెలుచుకుంది గాని, ఇప్పుడు ఒక సర్పంచ్ స్థానాన్ని గెలుచుకునే బలం టిడిపికి లేదు. పైగా తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపిల మధ్య పోరు నడుస్తోంది. ఇలాంటి తరుణంలో రాజకీయంగా టిడిపికి స్పేస్ లేదు.
Advertisement
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మునుగోడులో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబును కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిజెపికి మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించడంతోనే ఆయనను రాజగోపాల్ రెడ్డి కలుస్తున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి చంద్రబాబును కలిసిన తర్వాత బిజెపికి మద్దతుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Advertisement
మునుగోడు లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. వారం రోజుల కిందట తెలంగాణ టిడిపి నేతలు, చంద్రబాబును కలిసి మునుగోడులో పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పలువురు బీసీ నేతలు రెడీగా ఉన్నారన్నారు. అదే సమయంలో టిఆర్ఎస్ లో టికెట్ దక్కని బూర నర్సయ్య గౌడ్ కూడా పార్టీ తరపున పోటీకి ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆయన బిజెపిలోకి చేరడం దాదాపుగా ఖాయం అయింది. అయితే చంద్రబాబు మాత్రం ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని, అసెంబ్లీ ఎన్నికల వరకు బలపడేందుకు ప్రయత్నిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించాలని భావిస్తున్నారు. మునుగోడులో బీజేపీకి మద్దతు ఇచ్చి.. కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.
Read also : టెస్ట్ మ్యాచ్‌లో లంచ్ & టీ విరామ సమయంలో క్రికెటర్లు ఏం తింటారు?