Advertisement
తీన్మార్ మల్లన్న సినిమాలో నటించాడా..? ఆయన సినిమాలో నటించాడా లేదా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రశ్న. తీన్మార్ మల్లన్న కి అసలు సినిమాలో నటించే టాలెంట్ కూడా ఉందా..? ఇంతకీ ఆ సినిమా పేరేంటి ఆ వివరాలు గురించి ఇప్పుడే చూద్దాం. సోషల్ మీడియాలో చాలామంది ఈ ప్రశ్నలు అడుగుతున్నారు తీన్మార్ మల్లన్న నటించిన ఒక సినిమాలో సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దివంగత నటుడు వేణుమాధవ్ కలిసి తీన్మార్ మల్లన్న కామెడీ సీన్స్ లో నటించారు.
Advertisement
సినిమా పాతది అయినా కానీ ఆ సినిమా లోని సీన్స్ యూట్యూబ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అవి చూసి నెటిజెన్స్ నిజంగా ఇతను సినిమాల్లో నటించాడా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. తీన్మార్ మల్లన్న నటించిన ఒకే ఒక్క సినిమా శ్రీమతి బంగారం. ఇది 2016 లో వచ్చింది ఇది ఒక కామెడీ సినిమా. రాజీవ్ కనకాల, రిచర్డ్ ఋషి, తీన్మార్ మల్లన్న, వేణు మాధవ్, హేమ వంటి వాళ్ళు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకి వినయ్ బాబు దర్శకత్వం వహించారు ఈ సినిమా వచ్చిందని చాలామందికి అసలు తెలియనే తెలియదు. తీన్మార్ మల్లన్న నటించారన్న విషయం కూడా అసలు తెలియదు.
Advertisement
వేణుమాధవ్ పక్కన ఉన్న యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా 😂 pic.twitter.com/YFQ5L25FjA
— Vamshi ( Modi Ji Ka Parivar ) (@vamsi_144) January 1, 2024
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ద్వారా అందరికీ ఈ సినిమా ఉందని తీన్మార్ మల్లన్న నటించాడని తెలుస్తోంది ఈ మూవీలో వేణుమాధవ్ తీన్మార్ మల్లన్న స్నేహితులుగా నటించారు. ఇందులో వీళ్ళిద్దరూ కూడా కార్మికులుగా నటించారు. వేణు మాధవ్ కి హేమ భార్యగా నటించింది. తాగుబోతు భర్త అయిన వేణుమాధవ్ ని భద్రకాళి లా భార్య హేమ క్రమశిక్షణలో పెట్టడం జరుగుతుంది మల్లన్న వేణుమాధవ్ కలిసి తాగుతూ ఉంటారు. ఇలా కామెడీని సినిమాలో పండించారు. తీన్మార్ వార్తలు కార్యక్రమం ద్వారా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పాపులర్ అయిపోయారు. అప్పట్లో తీన్మార్ మల్లన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండేది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!