Advertisement
సూపర్హీరోగా మారిన చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జా హనుమాన్ కోసం చాలానే కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కృషి, తేజ్జ సజ్జా పెట్టిన ఎఫర్ట్స్ కూడా ఈ సినిమా రిజల్ట్ లో కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా తేజ సజ్జా చాలానే కష్టపడ్డాడట. ఈ సినిమా రిలీజ్ అయ్యిన తరువాత తేజ సజ్జ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా షూటింగ్ టైం లో జరిగిన విషయాలను ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.
Advertisement
Advertisement
సక్సెస్ మీట్ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ గురించి తేజ సజ్జా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హనుమంతుని శక్తులు వచ్చిన పాత్రలో నటించిన తేజ సజ్జా కొన్ని యాక్షన్ సీన్స్ కోసం చాలానే ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిందట. గాల్లో ఎగిరే కొన్ని షాట్స్ కోసం కనీసం ఆరు గంటల పాటు తాళ్లు పట్టుకునే వేలాడుతూనే ఉండాల్సి వచ్చేదట. చాలా వరకు దుమ్ము ధూళిలోనే షూటింగ్ చేయాల్సి వచ్చిందట.
అయితే.. ఎక్కువ కాలం పాటు దుమ్ము ధూళిలోనే షూటింగ్ చేయాల్సి రావడంతో కుడి కన్ను కనిపించకుండా పోయిందట. కన్ను మరీ ఇబ్బంది అవడంతో హాస్పిటల్ కి వెళితే.. అక్కడ వారు సర్జరీ చేయాలనీ చెప్పారట. దీనితో షూటింగ్ కి ఇబ్బంది అవుతుందని సర్జరీ చేయించుకోకుండా షూటింగ్ అయ్యాక చేయించుకుంటానని చెప్పాడట. ఇది చెప్తుంటే అందరు అయ్యోపాపం అని అనుకున్నారు. కానీ భరించిన వాళ్ళకే ఈ పెయిన్ తెలుస్తుంది. ఆ ఎఫర్ట్ కి ఇప్పుడు కచ్చితంగా ఫలితం కనిపిస్తోంది.