Advertisement
హైదరాబాద్ లో ఇంర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంది. రోజూ వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.
Advertisement
శంషాబాద్ విమానాశ్రయంలో ప్యాసింజర్ స్ర్కీనింగ్ తో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పాజిటివ్ కేసుల నమూనాలను పంపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలను కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. ముఖ్యంగా ఆదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువ దృష్టి పెట్టారు.
Advertisement
కరోనా కొత్త వేరియంట్ వార్తల నేపథ్యంలో అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష జరిపారు. కరోనాపై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. కోవిడ్ టెస్టులు, బూస్టర్ డోస్ ల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపాలని హరీష్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ లోనే ఉంది. బుధవారం తెలంగాణలో ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34 మాత్రమే అని ఆరోగ్య శాఖ ప్రకటించింది.