• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » “జెట్టి” సినిమాపై తెలంగాణ మంత్రి తలసాని ప్రశంసలు

“జెట్టి” సినిమాపై తెలంగాణ మంత్రి తలసాని ప్రశంసలు

Published on October 31, 2022 by karthik

Advertisement

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో చాలా రకాల సినిమాలు వస్తున్నాయి. క్రైమ్‌, రియల్‌ స్టోరీలు, కామెడీ, హారర్‌, జీవిత కథలు ఇలా ఎన్నో వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే… యధార్థ కథ ఆధారంగా వస్తోన్న సినిమానే “జెట్టి”. ఈ “జెట్టి” సినిమాలో టాలీవుడ్ బ్యూటీ నందితా శ్వేత, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్దిన్ ప్రొడక్షన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణుమాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడగండ్ల సంగీతం అందించగా, కార్య నిర్వాహక నిర్మాతగా పండ్రాజు శంకర్ వ్యవహరించారు.

Jetty Movie

Advertisement

“జెట్టి” అంటే రేవుకి రక్షణ కల్పించటం కోసం ఒడ్డు నుండి సముద్రంలోకి వేసే ఒక ప్లాట్ఫారం. దళ్లారి వ్యవస్థ రూపు మాపాలన్నా, ప్రకృతి విలయాలతో పోరాడాలన్నా మత్స్యకారులకున్న ఏకైక ఆయుధం “జెట్టి”. వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, వాళ్ళ జీవితాల కోసం చేసే పోరాటమే “జెట్టి’ సినిమా సారంశం.
ప్రపంచానికి మారుమూలాగా బ్రతికే మత్స్యకారుల కఠినమయిన కట్టుబాట్లు, వారి జీవనశైలి, అలాగే వీరు పోరాటం చేసే “జెట్టి”ని మత్స్యకారులు ఎలా సాధించారు? అనే కథాంశంగా “జెట్టి” సినిమా సాగుతుంది. అయితే.. ఇటీవలే ‘జెట్టి’ సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు.

 

ట్రైలర్ బాగుందన్న ఆయన, చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలయిన పాటలకు శ్రీమణి తన కలాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ స్వరాన్ని అందించాడు. ఇది ఇలా ఉండగా.. తాజాగా జెట్టి టీమ్ కి తెలంగాణ రాష్ట్ర మత్స్య & సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అభినందనలు తెలిపారు. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని, నిర్మాతలకు లాభాలు రావాలని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కోరారు. ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని విజ్ఙప్తి చేశారు. ఇలాంటి సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.

Advertisement

Read also: కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే!

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd