Advertisement
తెల్ల గలిజేరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలామందికి ఈ విషయం తెలీదు. కానీ పల్లె ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వాటిల్లో తెల్ల గలిజేరు కూడా ఒకటి. ఈ మొక్కల్ని చూసి పిచ్చి మొక్కలు, పనికిరావని అందరూ అనుకుంటారు కానీ ఈ మొక్కల్లో ఔషధ గుణాలు గురించి చూశారంటే షాక్ అయిపోతారు. ఈ మొక్కను ఔషధాల గని అని అంటారు. ఆయుర్వేదంలో ఈ మొక్కను పునర్నవ అని పిలుస్తారు భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కను చాలా రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఎన్నో రకాల జబ్బుల్ని నయం చేయగలదు.
Advertisement
Advertisement
గలిజేరులో రెండు రకాలు ఉన్నాయి. తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు. ఎర్ర పూలు ఉంటే దాన్ని ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేల మీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ డి అందిస్తుంది. మూత్రనాల ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. క్యాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తెల్ల గలిజేరు ఆకులు తీసుకోని శుభ్రం చేసి పావు లీటర్ నీటిలో మరిగించి చల్లార్చి వడపోసి రోజు తీసుకుంటే కిడ్నీలు క్లీన్ అయిపోతాయి.
Also read:
లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, కఫం వంటి సమస్యల్ని కూడా ఇది నయం చేయగలదట. రక్త శుద్ధి, కీళ్ల నొప్పులు, పీరియడ్ సమస్యలు, జ్వరం కూడా తగ్గుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఈ పునర్నవ నయం చేయగలరని వైద్యులు అంటున్నారు. దీనిని తీసుకోవడం వలన మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సహాయం చేస్తుంది. మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!