Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా వరుసగా సీక్వెల్స్ రాబోతున్నాయి. ఈ సినిమాల షూటింగ్ కూడా ప్రారంభమైంది. మరి ఆ సీక్వెల్స్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
1. మంచి విష్ణు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “డి” మూవీకి సీక్వెల్ రాబోతోంది. కెరియర్ పరంగా చాలా డల్ అయిన మంచు విష్ణుకు అర్జెంటుగా ఒక హిట్టు కావాల్సిన టైం. ఎలా ఉంటుందో చూడాలి.
2. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన గూడచారి సైలెంట్ గా హిట్ కొట్టింది. ఈ మూవీకి కూడా సీక్వెల్ రాబోతుందట.
3. ఇప్పటికే కేజిఎఫ్ సెకండ్ పార్ట్ వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ చిత్రానికి మూడవ భాగం కూడా రాబోతోందని, సెకండ్ పార్ట్ ఎండింగ్ లో కన్ఫామ్ చేశారు. కానీ దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
4.ఈ మధ్యకాలంలో విడుదలై సూపర్ హిట్ అయిన “పోన్నియన్ సెల్వన్” మూవీ రెండు భాగాలుగా రాబోతున్నట్టు ముందే ప్రకటించారు. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది రాబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా లేటెస్ట్ గా రిలీజ్ అయిన కార్తి సర్దార్ మూవీ కూడా సీక్వెల్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.
Advertisement
also read: “కాంతారా”లో 2 మిస్టేక్స్ గమనించారా..ఎలా మిస్సయ్యావు రిషబ్ శెట్టి..!!
5. కోలీవుడ్ స్టార్ హీరోగా కార్తీ నటించిన ఖైదీ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి కూడా సీక్వెల్ రాబోతోందని త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని సమాచారం.
6. తెలుగులో కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ జాతి రత్నాలకు సీక్వెల్ రాబోతోంది. అమెరికా షిఫ్ట్ అవుతారని టాక్.
7. ఇప్పటికే పుష్ప మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ, పుష్ప2తో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
8. తాజాగా విడుదలైన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయనందుకుంది. దీనికి సీక్వెల్ గా పార్ట్ 3 రాబోతోందని సమాచారం.
9. Dj టిల్లు మూవీతో ఇప్పటికే సందడి చేసిన హీరో, దీనికి సీక్వెల్ గా పార్ట్ 2 తో మరింత హంగామా చేయనున్నారు.
also read: