Advertisement
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మద్రాస్ ప్రెసిడెంట్ లో భాగంగా ఉండేవి. స్వతంత్రం వచ్చాక 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున మద్రాసు ప్రెసిడెన్సి మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1న కోస్తా, రాయలసీమ ప్రాంతాలని మద్రాస్ రాష్ట్రం నుండి విడదీశారు. ఇలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రాల గురించి పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా ఈరోజు చూసేద్దాం.. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం లోని తెలుగు మాట్లాడి ప్రాంతాలను విడదీసి ఆంధ్ర రాష్ట్రం తో కలిపి ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ 15 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
Advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విషయానికి వచ్చేస్తే.. మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పని చూశారు. 1956 నవంబర్ 1 నుండి 1960 జనవరి 11 వరకు 3 ఏళ్ళు 71 రోజులు పాటు ఆయన పని చేశారు. తర్వాత దామోదరం సంజీవయ్య 1960 జనవరి 11 నుండి 1962 మార్చి 12 వరకు పని చేశారు. ఈయన మొత్తం రెండు ఏళ్ళు 60 రోజులు పాటు పనిచేశారు. నీలం సంజీవరెడ్డి మళ్ళీ గెలిచారు. నీలం సంజీవరెడ్డి 1962 మార్చి 29 నుండి 1964 ఫిబ్రవరి 29 వరకు ఏడాది పాటు పనిచేశారు. తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1964 ఫిబ్రవరి 29 నుండి 1971 సెప్టెంబర్ 30 వరకు ఈయన పని చూశారు. ఆ తర్వాత పీవీ నరసింహారావు 1971 సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 10 వరకు ఏడాది పాటు పనిచేశారు. జలగం వెంగళరావు నాలుగు సంవత్సరాలు 86 రోజులు పని చేశారు.
Advertisement
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండు సంవత్సరాలు 250 రోజులు పని చేసారు. తర్వాత టంగుటూరు అంజయ్య 1980 అక్టోబర్ 11 నుండి 1982 ఫిబ్రవరి 24 వరకు ఒక సంవత్సరం 136 రోజులు పనిచేశారు. భవనం వెంకటరామరెడ్డి 1982 ఫిబ్రవరి 24 నుండి 28 రోజులు పాటు పనిచేశారు. కోట్ల వెంకట భాస్కర్ రెడ్డి 111 రోజులు పనిచేశారు తర్వాత నందమూరి తారక రామారావు 1983 జనవరి 9 నుండి, 1984 ఆగస్టు 16 వరకు ఒక సంవత్సరం 250 రోజులు పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు 1984 ఆగస్టు 16 నుండి 1984 సెప్టెంబర్ 16 వరకు 31 రోజులు పనిచేశారు.
మళ్లీ నందమూరి తారక రామారావు 1984 సెప్టెంబర్ 16 నుండి 174 రోజులు పని చేశారు. ఆ తర్వాత 1985 మార్చి 9 నుండి 1989 డిసెంబర్ 2 వరకు నాలుగేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సేవలందించారు. నందమూరి తారక రామారావు మళ్లీ 1994 డిసెంబర్ 12 నుండి 263 రోజులు సేవలందించారు. నారా చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1 నుండి 2004 మే 14 వరకు 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 మే 14 నుండి 2009 సెప్టెంబర్ 2 వరకు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు.
ఆ తర్వాత ఏడాది రోశయ్య పని చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మూడేళ్లు సీఎంగా ఉన్నారు. 2014 జూన్ 8 నుండి 2019 మే 30 వరకు నారా చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు. ఆ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 మే 30 నుండి ఇప్పటివరకు కూడా కొనసాగించుతున్నారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కె చంద్రశేఖర రావు 2014 నుండి 2018 వరకు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి సేవలందించారు. తర్వాత మళ్ళీ 13 డిసెంబర్ 2018 నుండి 6 డిసెంబర్ 2023 వరకు కొనసాగించారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా నియమితులయ్యారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!