• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » చుక్కల్లో కలిసిన 15 మంది భారతీయ సినీ నటులు వీరే..!!

చుక్కల్లో కలిసిన 15 మంది భారతీయ సినీ నటులు వీరే..!!

Published on January 23, 2023 by karthik

Advertisement

సినీ ప్రపంచంలో ప్రేక్షకులను అలరించి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సినిమా ఎప్పుడు ఎండ్ అవుతుందో అందరికీ తెలుసు కానీ జీవితానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో ఎవరికీ తెలియదు. అయితే సినీ తారాల ప్రపంచం సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ వారికి కూడా కష్టాలు, ఒత్తిళ్ళు ఉంటాయి. అలా సినీ పరిశ్రమలో కష్టాల బారినపడి, లేదా అనారోగ్య సమస్యలతో, లేదా రోడ్డు ప్రమాదాల వల్ల కొంతమంది నటీనటులు చుక్కల్లో కలిసిపోయారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Read also:  “జెట్టి” సినిమాపై తెలంగాణ మంత్రి తలసాని ప్రశంసలు

10 famous Hero’s and Heroin’s who Died Young

1) యశోసాగర్.

“ఉల్లాసంగా ఉత్సాహంగా” సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యశో సాగర్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే తరువాత సినిమా షూటింగ్ కోసం వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు.

2) సౌందర్య.

అభినవ సావిత్రి గా పేరు తెచ్చుకున్న సౌందర్య 31 ఏళ్ల వయసులో 2004లో కరీంనగర్ వెళ్లేందుకు బయలుదేరిన ఈమె విమాన ప్రమాదంలో కన్నుమూశారు.

3) ఉదయ్ కిరణ్.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి లవర్ బాయ్ మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ వివిధ కారణాలవల్ల సూ*## చేసుకున్నారు.

4) శ్రీహరి.

2013 లో రాంబో రాజ్ కుమార్ అనే హిందీ సినిమా షూటింగ్ చేస్తుండగా అనారోగ్యానికి గురైన రియల్ స్టార్ శ్రీహరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

5) సిల్క్ స్మిత.

సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి సిల్క్ స్మిత 31 ఏళ్ల వయసులో వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

6) పునీత్ రాజ్ కుమార్.

ఈ కన్నడ స్టార్ అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

7) ఆర్తి అగర్వాల్.

Advertisement

ఈ భామ తన బరువును తగ్గించుకునేందుకు లైపో సక్సెన్ చేయించుకుంది. దాని ప్రభావం వల్ల 2015 లో హార్ట్ ఫెయిల్యూర్ తో మరణించింది.

8) వేణుమాధవ్.

కమెడియన్ వేణుమాధవ్ కూడా అనారోగ్యంతో మరణించారు.

9) చక్రి.

ఈ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ 2014లో గుండెపోటుతో మరణించారు.

10) కునాల్ సింగ్.

ప్రేమికుల రోజు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న కునాల్ సింగ్ పెళ్లి తర్వాత వ్యక్తిగత కారణాలవల్ల సూ**# చేసుకొని మరణించారు.

11) రఘువరన్.

తన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న రఘువరన్ అనారోగ్య కారణాల వల్ల మరణించారు.

12) శ్రీదేవి.

తన అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించిన ఈ అతిలోకసుందరి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగి మరణించింది.

13) సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సైతం వ్యక్తిగత సమస్యలతో ప్రాణాలు తీసుకున్నారు.

14) దివ్యభారతి.

చిన్న వయసులోనే తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె 19 ఎల్ల వయసులోనే బిల్డింగ్ పై నుండి పడి మరణించింది.

15) సావిత్రి.

మహానటిగా అందరి మన్ననలు పొందిన సావిత్రి అనారోగ్యంతో 45 ఏళ్ళ వయసులో ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Also Read: ఈ వారం విడుదలకు సిద్ధమైన సినిమాలు ఇవే..!!

Latest Posts

  • సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 10 వస్తువులు
  • వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్లు.. ఈ తారలు
  • Kantara: కాంతార సినిమాలో మొదట‌గా ఆ స్టార్ హీరోను అనుకున్నారట.. కానీ
  • సినిమాల్లోకి రావడానికి కాంతారా హీరో ఏం చేశాడంటే..?
  • ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd