Advertisement
మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 7వ తేదీన మొదలైన నామినేషన్లు 14వ తేదీకి ముగిసాయి. ప్రధాన పార్టీల నుంచి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇక ఈ మునుగోడు ఉప ఎన్నిక వేళ టిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బిజెపిలో చేరనున్నారని తెలుస్తోంది.
Advertisement
మునుగోడు టిక్కెట్ ఆశించిన ఆయన, టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బూర నర్సయ్య గౌడ్ బిజెపి పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఇలా ఉండగా టిఆర్ఎస్ పార్టీకి మరో పరేషాన్ వచ్చింది. ఉప ఎన్నికల్లో భాగంగా ఈసీ విడుదల చేసిన గుర్తుల జాబితాలో కారును పోలిన 8 గుర్తులు ఉన్నాయంటూ, ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల గుర్తుల జాబితాలో కెమెరా, చపాతి రోలర్, డాలి, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ ఈ ఎనిమిది గుర్తులు తమ పార్టీ గుర్తు అయిన కారును పోలి ఉన్నాయంటూ నేతలు ఆరోపిస్తున్నారు.
Advertisement
ఆ గుర్తులను తొలగించాలని, కారును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించొద్దంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆ పార్టీ నేతలు కోరారు. అయితే, ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, టీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. హౌస్ మోషన్ విచారణ చేపట్టాలని నిన్న హైకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం నిరాకరించింది. దీంతో, రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. మరి దీనిపై టిఆర్ఎస్ కు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
READ ALSO : జగన్ కు షాక్..పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు ఫోన్