Advertisement
Thangalaan Review: తంగలాన్ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహించారు. కె.ఈ.జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, జ్యోతి దేశ్ పాండే ఈ సినిమాను నిర్మించారు. విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్ తదితరులు తదితరులు ఈ సినిమాలో నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇక కథ, రివ్యూ అండ్ రేటింగ్ చూసేద్దాం.
Advertisement
సినిమా: తంగలాన్
దర్శకత్వం: పా.రంజిత్
నిర్మాత: కె.ఈ.జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, జ్యోతి దేశ్ పాండే
నటులు: విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్ తదితరులు తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
రిలీజ్ డేట్: 16-08-2024
కథ:
బ్రిటిష్ దొర డానియల్ కు బంగారం మైనింగ్ చేసి డబ్బు సంపాదించాలని ధ్యేయం అందుకోసం విక్రమ్ సహాయాన్ని కొడతాడు. తాత ముత్తాతల నుంచి బంగారం కనిపెట్టడంలో మంచి పేరు ఉన్న తంగలాన్ అందుకు అంగీకరించే దొరలతో పాటుగా ఒక చిన్న బృందాన్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. బంగారానికి దగ్గరవుతున్న కొద్ది మంత్రగత్తే ఆరతి తంగలాన్ బృందాన్ని ఇబ్బంది పెడుతుంది. అసలు ఈమె ఎవరు..?, ఎందుకు ఆ బృందాన్ని ఇబ్బంది పెడుతోంది..? చివరికి బంగారం దొరికిందా..? వీళ్లంతా ఎలా కష్టపడ్డారు వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో విక్రమ్ తన పాత్రలో అద్భుతంగా నటించారు.
రొటీన్ గా ఆయన నటించిన మూవీ కోసం విక్రమ్ పడిన కష్టం తెరమీద కనబడుతుంది. దళితుడిగా విక్రం బాడీ లాంగ్వేజ్ కానీ పర్ఫామెన్స్ కానీ చాలా బాగుంది. మిగిలిన నటులు కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా బాగానే నటించారు. మాళవిక లోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ఇది. ఇప్పటిదాకా సామాజిక మాధ్యమాల్లో ఆమె అందాల ప్రదర్శనలు మాత్రమే అందరూ చూశారు కానీ ఇప్పుడు సినిమాల్లో ఆమెని చూశారు కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి చాలా కీలకమైన అంశం.
Advertisement
కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్స్ సినిమాకి చాలా కీలకమైన అంశం అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో రాత్రి చీకటిని ఒకేసారి చూపిస్తూ భిన్నమైన భావాలను తెరపై పండించడం అనేది సినిమాటోగ్రాఫర్ పనితనానికి ప్రత్యేక క్లైమాక్స్ లో బంగారు మేనితో విక్రం గుహ నుంచి బయటకు వచ్చిన సన్నివేశం కూడా కళాత్మకంగా ఉఉన్నాయి. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక వైవిధ్యమైన అనుభూతిని ఇస్తూనే తరతరాలుగా దళితులు ఎదుర్కొన్న కష్టాలని అద్భుతంగా పండించారు. కథకుడిగా కంటే దర్శకుడిగా మంచి మార్కులను సంపాదించుకున్నారు. ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించేలా ఈ సినిమా ఉంది చరిత్రలో చోటు చేసుకున్న రాజకీయ కులమత విద్వేషాలు సమీకరణల గురించి కనీస స్థాయి అవగాహన ఉంటే తప్ప ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయలేరు.
Also read:
ప్లస్ పాయింట్స్:
కథ
నటులు
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
వీఎఫెక్స్
అక్కడక్కడా సీన్స్
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!